నాగబాబుకు చుక్కలు చూపించిన బాలయ్య అభిమానులు..! ఏ రేంజ్ లో కసితీర్చుకున్నారో చూడండి!     2019-01-06   11:08:40  IST  Sai Mallula

మెగా బ్రదర్ నాగబాబు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ మధ్య అందుకు తగ్గట్టుగా నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన అంతకు ముందుకంటే ఎక్కువగా… యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ముఖ్యంగా…. సినీనటుడు హిందూపూర్ తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని టార్గెట్ చేస్తునట్టు కనిపిస్తోంది. . మొన్న ఆ మధ్య ‘బాలయ్య ఎవరో నాకు తెలియదు’ అనేశారు నాగబాబు. ఆ తర్వాత దానికి కొనసాగింపుగా మరికొన్ని వివాదాస్పద ఫోటోలు షేర్ చేసి. ఆ ఫొటోల్లోని జంతువుల బ్రీడ్స్‌, బ్లడ్‌ ‘రేర్‌’ అని చెప్పుకొచ్చారు. కావాల్సిన వారు కొనుకోండి అంటూ చెప్పుకొచ్చారు.

Balakrishna Fans Targets Nagababu At Chennai Eltech College-Chennai College Jai Balayya Slogans

Balakrishna Fans Targets Nagababu At Chennai Eltech College

దీంతో ఆగ్రహం చెందిన బాలయ్య అభిమానులు…తమ స్టైల్ లో కసి తీర్చుకున్నారు. చెన్నైలోని ఒక ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ఒక వేడుకకు ముఖ్య అతిథిగా వెళ్లిన నాగబాబుకు చుక్కలు చూపించారు. నాగబాబు కనిపించగానే జై బాలయ్య నినాదాలతో హోరెత్తించేశారు. నాగబాబు డౌన్ డౌన్ అని కూడా అరిచారు. అంతకంతకూ నినాదాలు పెరిగాయే తప్ప తగ్గలేదు.

దీంతో నాగబాబు అక్కడ ప్రసంగం కూడా చేయకుండానే నిష్క్రమించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.