ఎన్టీఆర్‌ పై విమర్శల వాడి పెంచుతున్న బాబాయి ఫ్యాన్స్‌.. అసలు విషయం ఇది  

Balakrishna Fans Fire On Jr Ntr-

నందమూరి ఫ్యామిలీలో మళ్లీ వివాదం, విభేదాలు వస్తున్నట్లుగా టాక్‌ వినిపస్తుంది.బాలకృష్ణ, ఎన్టీఆర్‌ల మద్య వివాదం ఉన్న విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే.

Balakrishna Fans Fire On Jr Ntr- Telugu Tollywood Movie Cinema Film Latest News Balakrishna Fans Fire On Jr Ntr--Balakrishna Fans Fire On Jr NTR-

అయితే హరికృష్ణ మరణం తర్వాత ఇద్దరి మద్య వివాదం సర్దుమణిగింది.ఇద్దరు ఒకరి సినిమా వేడుకల్లో ఒకరు పాల్గొన్నారు.అరవింద సమేత సమయంలో బాలయ్య ఆశీర్వాదం ఇవ్వగా, ఎన్టీఆర్‌ బయోపిక్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌ తనవంతు సాయం అన్నట్లుగా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.దాంతో బాబాయి, అబ్బాయి మద్య వివాదాలు దాదాపుగా తొలగి పోయినట్లే అంటూ అంతా అనుకున్నారు.

అంతా సాఫీగా ఉందని భావిస్తున్న తరుణంలో బాలకృష్ణ ఫ్యాన్స్‌ కొత్త వివాదాన్ని రెచ్చ గొడుతున్నారు.‘ఎన్టీఆర్‌’ చిత్రం గురించి ఎన్టీఆర్‌ ఎందుకు స్పందించలేదు.

Balakrishna Fans Fire On Jr Ntr- Telugu Tollywood Movie Cinema Film Latest News Balakrishna Fans Fire On Jr Ntr--Balakrishna Fans Fire On Jr NTR-

తాత అంటే చాలా గౌరవం ఉందని చెప్పే ఎన్టీఆర్‌ ఈ చిత్రంపై ఎందుకు మాట్లాడటం లేదు.అసలు ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌ చూశాడా లేదంటే పై మాటల వరకే బాబాయిపై ఎన్టీఆర్‌ గౌరవాన్ని చూపించాడా అంటూ బాలకృష్ణ అభిమానులు అంటున్నారు.

బాలకృష్ణపై అభిమానం, ఎన్టీఆర్‌ పై గౌరవం అంటూ జూనియర్‌ చెప్పే మాటలు పచ్చి అబద్దాలంటూ బాలయ్య అభిమానులు విమర్శలు చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ కథానాయకుడు సినిమాపై మహేష్‌బాబుతో పాటు ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది కూడా స్పందించారు.సినిమా చాలా బాగుంది, ఎన్టీఆర్‌లా బాలయ్య లుక్‌ అద్బుతం అంటూ ప్రశంసలు కురిపించారు.అయితే ఎన్టీఆర్‌ మాత్రం కనీసం ట్వీట్‌ కూడా చేయలేదు.

సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చిన నేపథ్యంలో ఎన్టీఆర్‌ మీడియా ముందుకు వచ్చి సినిమా గురించి నాలుగు మంచి మాటలు చెబితే సినిమాకు హైప్‌ మరింతగా పెరిగి కలెక్షన్స్‌ కూడా ఎక్కువ వచ్చేవి అనేది బాలయ్య అభిమానుల వాదన.మొత్తానికి ఈ విషయం చిలికి చిలికి పెద్దదవుతోంది.

తాజా వార్తలు

Balakrishna Fans Fire On Jr Ntr- Related....