balakrishna fans are praising thaman why because , balakrishna fans, comments viral, interesting facts, praising thaman

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కెరీర్ తొలినాళ్లలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు.కొంతమంది థమన్ కాపీ క్యాట్ అని విమర్శలు చేశారు.

 Balakrishna Fans Are Praising Thaman Why Because-TeluguStop.com

తన మ్యూజిక్ గురించి ట్రోల్స్ వచ్చినా థమన్ కృంగిపోకుండా విజయాలను సొంతం చేసుకున్నారు.అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాల తర్వాత థమన్ కు క్రేజ్ ఊహించని స్థాయిలో పెరిగింది.

అఖండ సినిమాతో థమన్ స్థాయి పెరిగింది.

అఖండ సినిమా సక్సెస్ కు ఒక విధంగా థమన్ కారణమని చాలామంది కామెంట్లు చేస్తున్నారు.

థమన్ మ్యూజిక్ లేకుండా సినిమాను చూస్తే ఆకట్టుకోదని కామెంట్లు వినిపిస్తున్నాయి.థమన్ మ్యూజిక్ అందించిన సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.బాలయ్య ఫ్యాన్స్ థమన్ ను ప్రశంసిస్తున్నారు.కొంతమంది అభిమానులు అయితే థమన్ కు గుడి కట్టినా తప్పులేదని అభిప్రాయపడుతున్నారు.

ఈ సినిమా బాలయ్య అఖండ కాదని థమన్ అఖండ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.బాలయ్య బాబు మాస్ యాక్షన్ కు థమన్ మాస్ బీజీఎం తోడు కావడంతో అఖండ మూవీ సక్సెస్ సాధించింది.

భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, మరికొన్ని సినిమాలకు థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలు కూడా సక్సెస్ సాధించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తాయేమో చూడాలి.

Telugu Thaman-Movie

భీమ్లా నాయక్ పాటలు ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలిచాయి.ఈ సినిమాలు కూడా హిట్టైతే మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ పేరు మారుమ్రోగే అవకాశం ఉంది.థమన్ పూనకాలు వచ్చే విధంగా బీజీఎం ఇచ్చారని కామెంట్లు వినిపిస్తున్నాయి.సినిమాసినిమాకు థమన్ కు క్రేజ్ పెరుగుతోంది.థమన్ ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.థమన్ 13 సంవత్సరాలుగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube