స్టార్ హీరో బాలకృష్ణను( Balakrishna ) అమితంగా అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు.బాలయ్య అడపాదడపా వివాదాలలో చిక్కుకున్నా బాలయ్య సన్నిహితులు మాత్రం ఆయన గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెబుతుంటారు.
తాజాగా బాలయ్య అభిమాని ఒకరు చేసిన పని సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.ఈ అభిమాని అభిమానానికి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.
బాలయ్య వీరాభిమాని అయిన ఉప్పుటూరి రామ్ చౌదరి ( Uppathuri Ram Chaudhary )అమెరికాలో ఉంటూ ఇక్కడ ఎంతోమంది ఆకలిని తీరుస్తున్నారు.బాలయ్య ఆస్పత్రి అయిన బసవతారకం ఆస్పత్రికి వచ్చే రోగులు, రోగుల సహాయకులకు అన్నదానం చేస్తూ ఉప్పుటూరి రామ్ చౌదరి తన మంచి మనస్సును చాటుకున్నారు.
బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రామ్ చౌదరి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టగా ఈ కార్యక్రమం తాజాగా 50 రోజుల మైలు రాయిని అందుకుంది.

చేతన ఫౌండేషన్, అమెరికాలోని( Chetana Foundation, USA ) తన స్నేహితుల సహకారంతో రామ్ చౌదరి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్న రామ్ చౌదరి శివ అనే స్నేహితుడి ద్వారా బసవతారకం ఆస్పత్రికి వస్తున్న రోగులు ఆహారం విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు.బాలయ్యపై అభిమానం ఉన్న రామ్ చౌదరి బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

పేదలకు ఉచితంగా భోజనం అందేలా చేస్తూ రామ్ చౌదరి మంచి మనస్సును చాటుకుంటున్నారు.వెజ్ బిర్యానీ, అన్నం, పప్పు, కూర, పచ్చడి, సాంబార్, లడ్డు, వడియాలు, మజ్జిగ, అప్పడాలు, వారంలో మూడుసార్లు చికెన్ కూర, గుడ్డు, బిర్యానీ ఇస్తున్నారు.మరిన్ని ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగించాలని భావిస్తున్నానని రామ్ చౌదరి చెబుతున్నారు.స్టార్ హీరో బాలయ్య విషయానికి వస్తే బాలయ్య ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాతో బిజీగా ఉండటం గమనార్హం.