ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ లు ట్రెండింగ్ గా మారిపోయాయి.కాగా ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఒక సినిమాతో మరొక సినిమాని ముడి పెడుతూ సినిమాలు చేయడం.
లోకేష్ కనగరాజ్ ప్రాపర్ సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేశారు.ఖైదీ, విక్రమ్ చిత్రాలకు లింక్ సెట్ చేశాడు.
దీన్నికి లియో సినిమాని ముడిపెట్టబోతున్నారు.అలాగే కేజీఎఫ్ యూనివర్స్, తెలుగులో హిట్ యూనివర్స్ రాబోతుంది.
దర్శకుడు శైలేష్ కొలను ( Shailesh kolanu )దీనిని సృష్టించారు.కాగా ఇప్పటికే హిట్ యూనివర్స్ నుంచి రెండు సినిమాలు విడుదల అయిన విషయం తెలిసిందే.

తొలి సినిమాలో విశ్వక్ సేన్ నటించాడు.రెండో పార్ట్ లో అడవి శేష్( Adivi Sesh ) హీరోగా నటించారు.ఇక మూడో భాగంలో నాని నటిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాని ప్రకటించారు.కాగా తాజాగా హిట్4 సినిమాని కూడా ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ శైలేష్ కొలను.ఇందుకు మంచి ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే పార్ట్ 4 లో ఏకంగా అగ్ర హీరోని తీసుకోవాలి అని అనుకుంటున్నారట.ఆ అగ్ర హీరో మరెవరో కాదు బాలకృష్ణ.హిట్4 సినిమాని బాలకృష్ణతో చేయాలని భావిస్తున్నారట శైలేష్ కొలను.ఇప్పటికే బాలయ్యకి స్క్రిప్ట్ కూడా రెడీ చేసి, బాలయ్య బాబు కి కథ వినిపించగా పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారట.

అయితే దీని పై దర్శకుడికి ఇంకా ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది.ఇదిలా ఉంటే జూన్ 10న బాలకృష్ణ పుట్టిన రోజు( Balakrishna ) ఈ సందర్భంగా ఆయన నటించబోతున్న కొత్త సినిమాల ప్రకటనలు రానున్నాయి.ప్రస్తుతం అనిల్ రావిపూడితో ఎన్బీకే108 చిత్రంలో నటిస్తున్నారు బాలయ్య.ఈ సినిమా టైటిల్‌ని బర్త్ డే రోజు ప్రకటించనున్నారట.అలాగే హిట్ 4 కి సంబంధించిన అప్డేట్ కూడా బాలయ్య బాబు పుట్టినరోజు నాడు రానందుని తెలుస్తోంది.ఇకపోతే బాలయ్య బాబు సినిమాల విషయానికి వస్తే.
ఈ ఏడాది సంక్రాంతి పండుగకు వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య బాబు ప్రస్తుతం బాలయ్య బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు.ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
