చిన్నారితో బాలయ్య క్యూట్ వీడియో.. నెట్టింట వైరల్!

Balakrishna Enjoys Cute Moments With Akhanda Child Artist

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా హిట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 2న దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

 Balakrishna Enjoys Cute Moments With Akhanda Child Artist-TeluguStop.com

చాలా రోజుల తర్వాత బాలయ్య సినిమాపై ప్రేక్షకులు భారీ హోప్స్ పెట్టుకున్నారు.అందరు పెట్టుకున్న అంచనాలను బాలయ్య, బోయపాటి వమ్ము చేయలేదు.

చాలా రోజుల తర్వాత బాలయ్య నుండి ప్రేక్షకులు ఆశించిన ఇలాంటి మాస్ యాక్షన్ సినిమా రావడంతో అందరిలో ఒక కొత్త జోష్ కనిపిస్తుంది.ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్  సినిమాలు ఎంత హిట్ అయ్యాయో.

 Balakrishna Enjoys Cute Moments With Akhanda Child Artist-చిన్నారితో బాలయ్య క్యూట్ వీడియో.. నెట్టింట వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వాటి కన్నా కూడా ఇప్పుడు వచ్చిన అఖండ సినిమా రెట్టింపు హిట్ సాధించి కలెక్షన్స్ పరంగా కూడా సునామీ సృష్టిస్తుంది.

ఇక ఈ సినిమా విడుదల అయ్యి హిట్ అవ్వడంతో టాలీవుడ్ లో జాతర జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది.ఇది కేవలం బాలయ్య విజయం అయినా కూడా టాలీవుడ్ లో మిగతా హీరోలు కూడా చాలా రోజుల తర్వాత థియేటర్స్ దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు చూసి సంతోషం వ్యక్తం చేస్తూ బాలయ్యకు అభినందనలు చెప్పారు.ఇక తాజాగా బాలయ్య క్యూట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ వీడియో అఖండ షూటింగ్ సమయం లోనిది అని తెలుస్తుంది.బాలయ్య అఖండ షూటింగ్  సమయంలో ఒక చిన్న పాపతో కలిసి ఆప్యాయంగా ఉన్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఈ వీడియోలో బాలయ్యలో ఎప్పుడు చూడని ప్రేమ, ఆప్యాయత కనిపిస్తున్నాయి.అందుకే ఈ వీడియో తెలుగు అభిమానులకు బాగా నచ్చడంతో దీనిని ప్రెసెంట్ వైరల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.

మీరు కూడా బాలయ్య క్యూట్ వీడియోను చూసేయండి.

#Akhanda #Cute #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube