నందమూరి బాలయ్య ఫాన్స్ నాలుగు రొజులలో థియేటర్ లు దద్దరిల్లేలా రాబోతున్నారు.బాలకృష్ణ 99 వ చిత్రం డిక్టేటర్ విడుదల అవుతూ ఉండడం తో చాలా ఏర్పాట్లే సిద్దం చేస్తున్నారు బాలయ్య అభిమానులు.
సంక్రాంతి రేసు లో బాలకృష్ణ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు దానికి వీరాభిమానులు తోడు అవుతూ ఉండడం తో కాస్త ప్రయోగాత్మక సంబరాలు చేస్తున్నారు.ఈ సినిమా ని యూ ఎస్ లో 99 థియేటర్ లలో విడుదల చేస్తూ ఉండడం విశేషం ఈ సినిమా అక్కడ పెద్ద రికార్డు.
ఓ బయ్యర్ – కొందరు బాలయ్య అభిమానులు కలిసి ఎన్నారై టీడీపీ సపోర్ట్ తో ‘డిక్టేటర్’ను యుఎస్ లో ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం.
యుఎస్ రైట్స్ మరీ రేటు కూడా ఏమీ పలకలేదని సమాచారం.
విడుదలకు ముందు రోజు 13నే అక్కడ భారీగా ప్రిమియర్ షోలు కూడా ప్లాన్ చేస్తున్నారు.మరి ఆ షోలకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం దాదాపు 900 థియేటర్లలో భారీగా రిలీజవుతోంది ‘డిక్టేటర్’.