నందమూరి బాలకృష్ణ సినిమాల్లో ఎంత యాక్టివ్‌గా ఉంటారో నిజజీవితంలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటాడు.ముఖ్యంగా ఏదైనా పార్టీలో బాలయ్య చేసే గోల మామూలుగా ఉండదు.
యంగ్ హీరోలను సైతం వెనక్కి నెట్టి బాలయ్య తనదైన జోష్‌తో రెచ్చిపోతారు.తాజాగా బాలయ్య ఓ క్లబ్లో చేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
రూలర్ సినిమా షూటింగ్ బ్రేక్ టైంలో బాలయ్య పబ్‌లో తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన వేదాలం సినిమాలోని ‘ఆలుమా డోలుమా’ అనే సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు వేసి అక్కడున్నవారికి షాక్ ఇచ్చాడు.బాలయ్య తన స్టెప్పులను చాలా ఎనర్జీతో వేస్తుంటే అక్కడున్న యూత్ నోరెళ్లబెట్టారు.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది.
బాలయ్య బాబు తోపు దమ్ముంటే ఆపు అంటూ బాలయ్య ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్లు చేస్తున్నారు.
ఏదేమైనా మిగతా హీరోలతో పోల్చుకుంటే బాలయ్య ఎనర్జీకి అందరూ అభిమానులు కాక తప్పదు.ఇక రూలర్ సినిమాకు తాజాగా గుమ్మడికాయ కూడా కొట్టారు.
డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా రూలర్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు బాలయ్య.