ఇండస్ట్రీ మొత్తం నా వెంటే ఉంది నేనేం మాట్లాడాలి.. నాగబాబు వ్యాఖ్యలకు బాలయ్య కౌంటర్  

Balakrishna Counter To Nagababu - Telugu Balakrishna, Balakrishna Interview, Kcr Meeting, Nagababu

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో టాలీవుడ్‌ సినీ ప్రముఖుల భేటీపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతూనే ఉన్నాయి.హైదరాబాద్‌లోని భూములను పంచుకుంటున్నారా అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కూడా చర్చకు తెర లేపింది.

 Balakrishna Counter To Nagababu

ఇక నాగబాబు మాట్లాడుతూ బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.కుక్కలా మాట్లాడటంతో పాటు, బుద్ది గడ్డి తిన్నట్లుగా మాట్లాడాడు వెంటనే క్షమాపణ చెప్పాలంటూ తీవ్ర స్థాయిలో నాగబాబు మాట్లాడాడు.

నాగబాబు మాటలకు ఖచ్చితంగా బాలయ్య నుండి ఘాటైన గట్టి సమాధానం వస్తుందని అంతా ఊహించారు.కాని అనూహ్యంగా బాలయ్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లుగా చెప్పడంతో పాటు తనపై నాగబాబు చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడటానికి ఏమీ లేదని పేర్కొంది.

ఇండస్ట్రీ మొత్తం నా వెంటే ఉంది నేనేం మాట్లాడాలి.. నాగబాబు వ్యాఖ్యలకు బాలయ్య కౌంటర్-General-Telugu-Telugu Tollywood Photo Image

ఆయన చేసిన వ్యాఖ్యలపై సున్నితంగా కౌంటర్‌ ఇచ్చాడు.

తనకు ఇండస్ట్రీ మొత్తం మద్దతు తెలిపింది.తనను భేటీకి ఆహ్వానించక పోవడంను చాలా మంది తప్పుబట్టి నా వైపు మాట్లాడారు.అలాంటప్పుడు నేను నాకు వ్యతిరేకంగా మాట్లాడిన వారి విషయంలో స్పందించనక్కర్లేదు.

ఈ విషయంలో ఇంతకు మించి ఎక్కువగా మాట్లాడను అంటూ చెప్పుకొచ్చాడు.నాగబాబు విషయంలో బాలకృష్ణ స్పందనపై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరోసారి బాలయ్య నోరు జారితే ఆయన విమర్శలను ఎదుర్కొనేవాడు.కాని ఈసారి మాత్రం చాలా తెలివిగా స్పందించి మెప్పించాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు