నోరుజారిన బాలకృష్ణ

నందమూరి బాలకృష్ణ మరోసారి వివాదస్పద వాఖ్యలు చేసారు.ఈసారి రాజకీయ ప్రత్యర్థి మీద కాదు, సినిమావాళ్ళ మీద అంతకన్నా కాదు.

 Balakrishna Controversial Comments On Women-TeluguStop.com

అమ్మాయిల మీద.నిన్న జరిగిన నారా రోహిత్ “సావిత్రి” ఆడియో ఫంక్షన్ ఈ వాఖ్యలకు వేదికైంది.

తన ప్రసంగంలో చాలా విషయాలు మాట్లాడిన బాలకృష్ణ నటన, పాత్రల టాపిక్ లోకి వెళ్ళిపోయి ” నేను కూడా అన్ని రకాల పాత్రలు చేయలేను.కొన్ని పాత్రలే చేయగలను.

అమ్మాయిల వెంట పడమంటే ఎట్టాగయ్య .ఊరుకుంటారా మా ఫ్యాన్స్.వెళ్లి ముద్దయిన పెట్టాలి , కడుపయిన చేసేయ్యాలి .కమిట్ అయిపోవాలి అంతే ” అంటూ ఎవరు ఊహించని విధంగా మాట్లాడారు.

ఈ వాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలామంది ఇలా బాలకృష్ణ నోరుజారిన విధానంపై విరుచుకుపడుతున్నారు.స్టేజి మీద నడుస్తున్న టాపిక్ ఏంటి .ముద్దులు, కడుపు చేయడం వంటి పదాలు వాడాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

బాలకృష్ణ ఇలా మాట్లాడారంటే నమ్మబుద్ధి కావాట్లేదా? ఇదిగోండి .మీరూ ఈ విడియో చూసెయ్యండి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube