'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ ఎంట్రీపై బాలయ్య పోస్ట్.. నెట్టింట వైరల్!

ఆర్ఆర్ఆర్.ఈ సినిమా పేరు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువుగా వింటూ ఉంటున్నాం.మన ఇండియన్ సినిమా గర్వించదగ్గ సినిమాగా ఆర్ఆర్ఆర్ చరిత్రకెక్కింది.రౌద్రం రణం రుధిరం సినిమాను అగ్ర డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసాడు.ఈ సినిమా గత ఏడాది మర్చి 25న రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ గా సంచలన విజయాన్ని నమోదు చేసింది.

 Balakrishna Congratulate Rrr Naatu Naatu Bags Oscar Nomination, Balakrishna, Rrr-TeluguStop.com

మన స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన భారీ మల్టీ స్టారర్ 1200 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది.

ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్న వరల్డ్ వైడ్ గా చర్చ జరుగుతూనే ఉంది.ప్రపంచ ఆడియెన్స్ ను ఎంతగానో ఎలరించిన ఈ సినిమాలో చార్ట్ బస్టర్ గా నిలిచిన సాంగ్ ‘నాటు నాటు‘.

Telugu Balakrishna, Naatu Naatu, Oscar, Rajamouli, Ram Charan-Movie

ఈ సాంగ్ ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారం ఆస్కార్ కు నామినేట్ కావడం తెలుగు ఆడియెన్స్ కు అలాగే టీమ్ అందరికి ఇది భావోద్వేగమైన సమయం అనే చెప్పాలి.ఇంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డులకు నామినేట్ కావడంతో ఈ సినిమాకు మన సినీ ప్రముఖులు అభినందనలు చెబుతున్నారు.చిత్ర యూనిట్ కు, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సాహిత్య రచయిత చంద్రబోస్ గారికి శుభాభినందనలు చెబుతున్నారు.

Telugu Balakrishna, Naatu Naatu, Oscar, Rajamouli, Ram Charan-Movie

మరి నందమూరి బాలకృష్ణ కూడా ఈ సినిమా ఆస్కార్ రేసులో నిలవడంపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసారు.ఈ సినిమాలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ కు ఎంపిక కావడం ఆనందాన్ని కలిగించింది అని యూనిట్ మొత్తానికి నా అభినందనలు అంటూ తెలుపుతూ పోస్ట్ చేయగా అది కాస్త నెట్టింట వైరల్ అయ్యింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube