ఎన్టీఆర్ కు సాధ్యం కానిది బాలయ్యకు సాధ్యమవుతుందా.. ఏమైందంటే?

నందమూరి బాలకృష్ణ తన సినీ కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించారు.పౌరాణిక పాత్రలలో సైతం అద్భుతంగా నటించి బాలకృష్ణ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

 Balakrishna Confirms Ramanuja Biopic Movie Details, Balakrishna, Ramanuja Biopic-TeluguStop.com

ఈతరం హీరోలలో ఎలాంటి పాత్ర ఇచ్చినా మెప్పించే అతికొద్ది మంది స్టార్ హీరోలలో బాలకృష్ణ ఒకరని చెప్పవచ్చు.ప్రస్తుతం బాలకృష్ణ మాస్ మసాలా కథలలో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే సీనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో నటించాలని భావించి కొన్ని కారణాల వల్ల నటించని పాత్రలు ఎన్నో ఉన్నాయి.రామానుజాచార్యులు జీవితగాథలో నటించాలని సీనియర్ ఎన్టీఆర్ భావించగా ఎన్టీఆర్ రాజకీయాలలో బిజీ కావడం వల్ల ఇది సాధ్యపడలేదు.

అయితే తన తండ్రి నటించలేకపోయినా ఆ సినిమాలలో తాను నటిస్తానని బాలయ్య కొన్నేళ్ల క్రితం ఒక సందర్భంలో ప్రకటన చేశారు.

పంచాక్షరీ మంత్రంను అందరికీ ఉపదేశించిన రామానుజాచార్యులు పాత్రలో తాను నటిస్తానని తండ్రి కోరికను తాను నెరవేరుస్తానని బాలయ్య గతంలో చెప్పుకొచ్చారు.

Telugu Akhanda, Balakrishna, Balakrishna Ntr, Ramanuja Biopic, Senior Ntr-Movie

మరి బాలయ్య ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఎన్టీఆర్ కు సాధ్యం కానిది తనకు సాధ్యం అవుతుందని నిరూపిస్తారో లేదో చూడాల్సి ఉంది.గతేడాది అఖండ సినిమాతో బాలయ్యకు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కింది.బాలయ్య నటించిన ఈ సినిమా తక్కువ టికెట్ రేట్లతో ఏకంగా 80 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.

Telugu Akhanda, Balakrishna, Balakrishna Ntr, Ramanuja Biopic, Senior Ntr-Movie

బాలయ్య తర్వాత సినిమాలతో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సినిమాసినిమాకు మార్కెట్ ను పెంచుకుంటున్న బాలకృష్ణ తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.అయితే క్రేజ్ ఉన్నా బాలయ్య ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేయడం లేదు.

ఒక్కో సినిమాకు బాలయ్య రెమ్యునరేషన్ 12 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని సమాచారం.సినిమాసినిమాకు యూత్ లో కూడా బాలయ్యకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube