కేసీఆర్ పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు ?  

Balakrishna Comments On Kcr - Telugu Balakrishna, Balayya Comments On Kcr, Chiranjeevi, Kcr, Movie Meeting

ఇద్దరు టాలీవుడ్ హీరోల మధ్య ఎప్పటి నుంచో ఉన్న అంతర్గత మనస్పర్ధలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.తెలుగు సినిమా ఇండస్ట్రీలో అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉంటామంటూ పైకి చెప్పుకుంటున్న వారి మధ్య ఇగోలు మాత్రం పోవడం లేదు.

 Balakrishna Comments On Kcr

ఇదంతా ఎప్పుడూ ఇండస్ట్రీలో సర్వసాధారణమైన అంశంగానే భావించినా, అది కాస్తా మీడియాకు ఎక్కేసరికి పెద్ద విషయంగా మారిపోతోంది.ఇక కొద్ది రోజుల క్రితం కరోనా చారిటీ క్రైసిస్ పేరుతో టాలీవుడ్ పెద్దలు కొంతమంది మెగాస్టార్ చిరంజీవి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు.

వారు తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసిన సంగతి తెలిసిందే.ఆ సమావేశానికి హీరో నందమూరి బాలకృష్ణ ను పిలవకపోవడంతో ఆయన తీవ్రంగా మనస్థాపం చెందిన సంగతి తెలిసిందే.

కేసీఆర్ పై బాలయ్య సంచలన వ్యాఖ్యలు -General-Telugu-Telugu Tollywood Photo Image

ఆ కోపంలో ఉన్న బాలయ్యను ఈ అంశం గురించి మీడియా ప్రస్తావించగా, మంత్రితో కలిసి హైదరాబాదులోని భూములు పంచుకునేందుకే వారంతా కలిశారు అంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.దీనిపై చిరంజీవి వర్గం నుంచి బాలకృష్ణపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టడం అంతే స్థాయిలో బాలకృష్ణ వర్గం మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు.

కానీ పరోక్షంగా కేసీఆర్ ప్రభుత్వంపైన కూడా బాలకృష్ణ వివాదాస్పదంగా వ్యాఖ్యానించడంతో కేసీఆర్ బాలయ్య ని టార్గెట్ చేసుకుంటారనే ప్రచారమూ పెద్దఎత్తున జరిగింది.తాజాగా నందమూరి బాలకృష్ణ తో ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ నిర్వహించగా, అనేక ఆసక్తికర అంశాలను బాలయ్య ప్రస్తావించారు.

సీఎం కేసీఆర్ ను కలవడానికి సినిమా ఇండస్ట్రీ పెద్దలు అంతా వెళ్ళినప్పుడు నన్ను ఎందుకు పిలవలేదు అనేది నాకు తెలియదు అని, గతంలో నేను కెసిఆర్ పై రాజకీయ విమర్శలు చేయడంతో నన్ను పిలిచి ఉండకపోవచ్చని, ఒకవేళ అదే నిజమైతే ఆ విషయం తనకే చెబితే సరిపోయేదని బాలయ్య వ్యాఖ్యానించారు.కేసీఆర్ కు నా మీద ఎప్పుడూ కోపం లేదని, రాజకీయం వేరు ఇది వేరు అని చెప్పారు.కేసీఆర్ రామారావు గారి అభిమాని, అందుకే నేనంటే కేసీఆర్ గారికి ఎప్పుడూ పుత్రవాత్సల్యం ఉంటుందని బాలయ్య చెప్పుకొచ్చారు.నేను గతంలో చేసిన విమర్శలే ఇప్పుడు నన్ను పక్కన పెట్టడానికి కారణం అయితే, టిడిపి ఎంపీగా ఉన్న సమయంలో నామా నాగేశ్వర్ కేసీఆర్ పై ఎన్నో విమర్శలు చేశారని, ఇప్పుడు ఆయనే టిఆర్ఎస్ లో చేరారని, రాజకీయాలకు దీనికి సంబంధం లేదని బాలయ్య వ్యాఖ్యానించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test