సూపర్ బాలయ్య : క్యాన్సర్ ఆసుపత్రిలో నిరాడంబరంగా బర్త్ డే వేడుకలు...

తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి లెజెండ్ బాలకృష్ణ ఉన్నటువంటి  క్రజ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.బాలయ్య బాబు సినీ బ్యాక్ గ్రౌండ్ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తనకంటూ సొంతంగా తెలుగు ప్రేక్షకుల్లో ఓ ఇమేజ్ ని సంపాదించుకున్నాడు.

 Balakrishna, Birthday Celebrate, Basava Tarakam Cancer Hospital, Tollywood-TeluguStop.com

కాగా ఈ రోజు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో నందమూరి అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాలలో బాలకృష్ణ గురించి మరియు ఆయన మంచితనం గురించి వైరల్ చేస్తున్నారు.

కాగా ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ ప్రభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బాలకృష్ణ ఎటువంటి ఆడంబరాలకు పోకుండా నిరాడంబరంగా హైదరాబాద్ నగరంలో తన తల్లి పేరు మీదుగా నిర్మించినటువంటి బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో పేషంట్ల మధ్యలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నాడు.

అనంతరం చంద్రబాబు నాయుడు ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.కాగా బాలయ్య బాబు పుట్టిన రోజు వేడుకల ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే వైరల్ అవుతున్నాయి.

అంతేగాక సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ బాలయ్య బాబుకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అయితే ఈ విషయం మీద ఉండగా ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఇటీవలే బాలయ్య బాబు కి  పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ డైలాగ్ తో కూడిన వీడియో ని విడుదల చేశాడు.వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో ట్రెండింగ్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube