బాలయ్య మళ్లీ మొదలు పెట్టేది ఎప్పుడంటే..!  

Balakrishna Boypati Movie Shooting - Telugu August, Balakrishna, Balakrishna Movie Shooting Starts Late, Boyapati Srinu, Lockdown, Movie Shooitng

జూన్‌ నుండి షూటింగ్స్‌ ప్రారంభంకు అంతా ఏర్పాట్లు చేస్తున్నారు.కాని బాలయ్య మూవీని మాత్రం కాస్త ఆలస్యంగా ప్రారంభించే యోచనలో బోయపాటి ఉన్నట్లుగా తెలుస్తోంది.

 Balakrishna Boypati Movie Shooting

వారణాసి, కాశిల్లో చిత్రీకరణ జరపాల్సి ఉంది.అలాగే బాలయ్యతో పాటు భారీ ఎత్తున నటీనటులు నటించాల్సిన సీన్స్‌ బ్యాలన్స్‌ ఉన్నాయి.

కనుక వాటిని షూట్‌ చేసేందుకు చాలా సమయం పట్టడంతో పాటు, కాస్త రిస్క్‌.ఈ సమయంలో షూటింగ్‌ నిర్వహిస్తే ఆంక్షలు చాలా ఉంటాయనే ఉద్దేశ్యంతో ఆలస్యం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

బాలయ్య మళ్లీ మొదలు పెట్టేది ఎప్పుడంటే..-Movie-Telugu Tollywood Photo Image

బాలకృష్ణ ఆగస్టు నుండి తన సినిమాను మళ్లీ ప్రారంభిస్తాడని తెలుస్తోంది.బోయపాటి శ్రీను ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌లో దాదాపుగా సగానికి పైగా పూర్తి చేసినట్లుగా సమాచారం అందుతోంది.

బ్యాలన్స్‌ షూట్‌ను చకచక పూర్తి చేసి దసరాకు సినిమాను విడుదల చేయాలనుకుంటే ఈ కరోనా విపత్తు వచ్చి మొత్తం నాశనం చేసింది.ప్లానింగ్‌ అంతా కూడా రివర్స్‌ అయ్యింది.

ఏం చేయలేని పరిస్థితి.షూటింగ్స్‌ మళ్లీ పున: ప్రారంభించేందుకు సైతం వీలు లేకుండా విపత్తు సమయంలో ఉన్నాం.

బోయపాటి దర్శకత్వంలో గతంలో సింహా మరియు లెజెండ్‌ చిత్రాలను చేసిన బాలయ్య మరో సూపర్‌ హిట్‌ను ఈ చిత్రంతో ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.నందమూరి ఫ్యాన్స్‌ కూడా చాలా నమ్మకంతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.ఇలాంటి సమయంలో చిత్రీకరణ ఆగిపోవడంతో అందరు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమాను ఈ ఏడాదిలో విడుదల చేసే అవకాశం లేదని కూడా క్లారిటీ వచ్చే సింది.

వచ్చే ఏడాది సమ్మర్‌కు కాని ఇది విడుదల అయ్యే అవకాశం లేదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Balakrishna Boypati Movie Shooting Related Telugu News,Photos/Pics,Images..

footer-test