బాలయ్య సినిమాలో జుట్టు పీక్కోవాల్సిందేనట!  

Balakrishna Boyapati Srinu Nbk106 - Telugu Balakrishna, Boyapati Srinu, Nbk106, Tollywood News

నందమూరి బాలకృష్ణ రూలర్ చిత్రం తరువాత కొంత గ్యాప్ తీసుకుని తన నెక్ట్స్ చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమాను ప్రారంభించిన బాలయ్య, రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ప్రారంభించాడు.

 Balakrishna Boyapati Srinu Nbk106

అయితే తొలి షెడ్యూల్ ముగిసే సరికే లాక్‌డౌన్ రూపంలో ఈ సినిమాకు పెద్ద అడ్డంకి వచ్చింది.కాగా ఈ సినిమాలో బాలయ్య మునుపెన్నడూ చేయని పాత్రల్లో నటిస్తున్నాడని చిత్ర వర్గాల సమాచారం.

అయితే ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో నటిస్తున్నాడని చిత్ర యూనిట్ తెలిపింది.అయితే ఈ రెండు పాత్రలు ఎలా ఉండబోతున్నాయని ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.కాగా ఈ సినిమాలో బాలయ్య కవల పాత్రల్లో నటిస్తున్నాడని, అందులో ఒకటి విలన్ పాత్రగా ఉంటుందని, హీరో-విలన్ మధ్య సాగే సస్పెన్స్ డ్రామాకు ప్రేక్షకులు మెస్మరైజ్ కావడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.హీరో, విలన్ పాత్రల మధ్య నడిచే ట్రాక్ అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

బాలయ్య సినిమాలో జుట్టు పీక్కోవాల్సిందేనట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక బోయపాటి ఈసారి బాలయ్య కోసం ఓ పవర్‌ఫుల్ స్క్రిప్టును రాసినట్లు, తెలుగు సినిమాల్లో ఈ మధ్య చూడని కథ ఈ సినిమాలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నాడు.కాగా బాలయ్య ఈ సినిమాలో అఘోరా గెటప్‌లో మనకు కనిపిస్తాడని ఇప్పటికే చిత్ర యూనిట్ తెలిపింది.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.ఏదేమైనా ఈ సినిమాతో మరోసారి బాలయ్య సింహా, లెజెండ్ సినిమాల తరహా సక్సెస్‌ను అందుకోవడానికి రెడీ అవుతున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Balakrishna Boyapati Srinu Nbk106 Related Telugu News,Photos/Pics,Images..

footer-test