బాలయ్యతో డేంజర్ అంటున్న బోయపాటి

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను బాలకృష్ణతో చేయబోయే సినిమా వర్క్ లో ఉన్నాడు.సింహ, లెజెండ్ లాంటి సూపర్ హిట్స్ ని బాలకృష్ణకి అందించి ఈ సారి వాటికి మించిన సాలిడ్ హిట్ ని ఇవ్వాలని అనుకుంటున్నాడు.

 Balakrishna Boyapati Srinu Movie Titled As Danger, Tollywood, Telugu Cinema, Sou-TeluguStop.com

దాని కోసం ఇప్పటికే పవర్ ఫుల్ కథని సిద్ధం చేసిన బోయపాటి మరోసారి బాలకృష్ణతో ద్విపాత్రాభినయం చేయిస్తున్నారు.ఇక ఈ సినిమాలో బాలకృష్ణ ఒక పాత్రలో అఘోరాగా కనిపించనుండగా, మరో పాత్రలో రైతుగా కనిపిస్తాడు.

ఇక ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ కాగా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.ఈ నేపధ్యంలో సినిమా క్యాసింగ్ ని బోయపాటి ఫైనల్ చేశారు.

అలాగే సినిమాకి పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలని భావించి ఇప్పటికే అదిరిపోయే టైటిల్ ఒకటి ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.త్వరలో మంచి టైం చూసుకొని హీరోయిన్ గురించి సినిమా టైటిల్ గురించి అఫీషియల్ గా ప్రకటిస్తామని బోయపాటి ఇప్పటికే తెలియజేశారు.

ఇదిలా ఉంటే బాలకృష్ణ సినిమా టైటిల్ గురించి ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ అప్డేట్ న్యూస్ వినిపిస్తుంది.ఈ సినిమాకి డేంజర్ అనే టైటిల్ ని పెట్టారని చెప్పుకుంటున్నారు.

పదేళ్ళ క్రితం కృష్ణవంశీ దర్శకత్వంలో డేంజర్ టైటిల్ తో సినిమా వచ్చింది.అది పెద్ద డిజాస్టర్ అయ్యింది.

అయితే ఇప్పుడు బాలయ్య బాబు కోసం అదే టైటిల్ ని బోయపాటి పెట్టాడని బోగట్టా.డేంజర్ టైటిల్ బాలయ్యకి చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని భావించి దానికి ఒటేసినట్లు సమాచారం.

ఇక ఈ టైటిల్ కి సంబంధించి క్రియేటివ్ వర్క్ లో బోయపాటి బిజీగా ఉన్నాడని, త్వరలో దీనికి సంబందించిన అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.ఇక సినిమా షూటింగ్ కూడా ఆగష్టులో ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube