బాలయ్యను ఢీ కొడతానంటోన్న బ్యూటీ.. అయ్యే పనేనా?  

Balakrishna Boyapati Srinu Bhumika Roja Nbk106 - Telugu Balakrishna, Bhumika, Boyapati Srinu, Nbk106, Roja

నందమూరి బాలకృష్ణ చాలా గ్యాప్ తరువాత తన తాజా చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.గతంలోనే ఈ సినిమా ప్రారంభం కాగా తొలి షెడ్యూల్ షూటింగ్‌ను మాత్రమే పూర్తి చేసుకుంది.

 Balakrishna Boyapati Srinu Bhumika Roja Nbk106

రెండో షెడ్యూల్ కోసం రెడీగా ఉండగా కరోనా వైరస్ కారణంగా చిత్ర షూటింగ్‌ను వాయిదా వేశారు.

ఈ సినిమాతో మళ్లీ సింహా, లెజెండ్ తరహా హిట్ కొట్టాలని దర్శకుడు బోయపాటితో పాటు బాలయ్య కూడా చూస్తున్నాడు.

బాలయ్యను ఢీ కొడతానంటోన్న బ్యూటీ.. అయ్యే పనేనా-Gossips-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమాలో బాలయ్యకు విలన్‌గా ఓ లేడీ స్టార్ ఉంటుందనే వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.గతంలో ఈ పాత్ర కోసం నటి రోజాను సంప్రదించారని వార్తలు రాగా, అవన్నీ కూడా గాలివార్తలే అని ఆమె కొట్టిపడేసింది.

ఇక తాజాగా ఈ పాత్రలో నటించేందుకు అందాల భామ భూమిక అంగీకరించినట్లు తెలుస్తోంది.

కొంతకాలం కిందట టాలీవుడ్‌లో హీరోయిన్‌గా వెలిగిపోయిన ఈ బ్యూటీ, పెళ్లి తరువాత కేవలం క్యారెక్టర్ పాత్రలకే పరిమితం అయ్యింది.

గతంలో బాలయ్య నటించిన రూలర్ చిత్రంలోనూ భూమిక ఓ కీలక పాత్రలో నటించింది.ఇప్పుడు పూర్తి విలన్ పాత్రలో నటించేందుకు ఈమె ఓకే అన్నట్లు తెలుస్తోంది.

మరి బాలయ్య లాంటి పవర్‌ఫుల్ హీరోను ఎదురించాలంటే ఇంకా పవర్‌ఫుల్‌గా ఉండాలి.భూమిక ఈ విషయంలో ఎంతవరకు న్యాయం చేస్తుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు