బాలయ్యకు అట్టర్ ఫ్లాప్ డైరెక్టర్ కథ.. అంతా బోయపాటి చేతిలోనేనట!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టుకుంది.మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

 Flop Director Gives Story For Balakrishna, Balakrishna, Boyapati Srinu, Bb3, Tol-TeluguStop.com

ఇక ఈ సినిమాతో బాలయ్య-బోయపాటి కాంబో ముచ్చటగా మూడోసారి అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌పై కన్నేసింది.కాగా ఈ సినిమాను గతంలో వచ్చిన సింహా, లెజెండ్ తరహాలోనే పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు బోయపాటి రెడీ అవుతున్నాడు.

అయితే ఈ సినిమా విషయంలో ఓ అంశం నందమూరి ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.ఈ సినిమాకు కథను ఓ అట్టర్ ఫ్లాప్ చిత్ర దర్శకుడు అందించడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

గతంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ‘బెజవాడ’ చిత్రం ఎలాంటి డిజాస్టర్‌గా మిగిలిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను డైరెక్ట్ చేసిన వివేక్ కృష్ణ, బాలయ్య-బోయపాటి చిత్రానికి కథను అందించాడు.

బోయపాటికి ఈ కథ బాగా నచ్చడంతో ఆయన ఈ సినిమాను తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

కాగా ఈ సినిమా టీజర్‌ను బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయగా, దానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుండగా, బాలీవుడ్ నుండి ఓ కొత్త బ్యూటీని ఇందులో హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు.

మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube