అందరికీ సమాధానం ఇచ్చేసిన బోయపాటి.. మామూలుగా లేదుగా!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై తొలుత ఎలాంటి అంచనాలు క్రియేట్ కాలేదు.

 Boyapati Srinu Gives Strong Reply With Bb3 Teaser, Balakrishna, Boyapati Srinu,-TeluguStop.com

అసలే బోయపాటి తీసిని గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద హ్యాండ్ ఇచ్చాయి.దీంతో ఈ సినిమా కూడా అదే తరహాలో ఉంటుందని అందరూ భావించారు.

ఇక కొందరైతే బోయపాటిని ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు.

బాలయ్యకు మరో డిజాస్టర్‌ను అందించేందుకు బోయపాటి రెడీ అవుతున్నాడని హేళన చేశారు.

అయితే వారందరికీ బోయపాటి దిమ్మతిరిగేలా జవాబు ఇచ్చాడు.బాలయ్యతో ఆయన తెరకెక్కిస్తున్న చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఇటీవల బాలయ్య పుట్టినరోజున రిలీజ్ చేశారు.

ఈ టీజర్ పవర్‌ప్యాక్డ్‌గా ఉండటంతో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.ఇక ఈ టీజర్‌తో తనను ట్రోల్ చేసిన వారందరికీ బోయపాటి అదిరిపోయే జవాబు ఇచ్చాడు.

బోయపాటి-బాలయ్య కాంబో ఇప్పటికే సింహా, లెజెండ్ సినిమాలు వచ్చి బాక్సాఫీస్ హిట్‌లుగా నిలిచాయి.ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా అందులో ఒకటి అఘోరా పాత్ర అని తెలుస్తోంది.

కాగా రెండో పాత్రకు సంబంధించిన టీజర్‌నే చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.మరి అఘోరా పాత్రలో బాలయ్య ఎలా ఉంటాడో తెలియాలంటే మాత్రం ఆ లుక్‌కు సంబంధించిన పోస్టర్, టీజర్ వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇక ఈ సినిమాలో ఓ కొత్త హీరోయిన్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube