బాలయ్య హీరోయిన్ కూడా అక్కడి నుండే!  

Bollywood Beauty To Romance Balakrishna, Balakrishna, Boyapati Sreenu, Tollywood News, Heroine - Telugu Balakrishna, Boyapati Sreenu, Heroine, Tollywood News

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్నాడు.గతంలో సింహా, లెజెండ్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన బోయాపాటి మరోసారి బాలయ్యతో అదిరిపోయే హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.

 Balakrishna Boyapati Sreenu Thaman

కాగా ఈ సినిమా షూటింగ్‌ను ఇప్పటికే ప్రారంభించిన చిత్ర యూనిట్, ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.

బాలయ్యను మరింత పవర్‌ఫుల్‌గా చూపించడంలో బోయపాటి తరువాతే ఎవరైనా అని ఎందుకు అంటారో ఈ టీజర్ చూస్తే అర్థమవుతోంది.

బాలయ్య హీరోయిన్ కూడా అక్కడి నుండే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ప్రస్తుతానికి BB3 అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా అందులో అఘోరా పాత్ర సినిమాకే హైలైట్‌గా కానుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సినిమాలో ఓ కొత్త హీరోయిన్‌ను తీసుకుంటున్నట్లు బోయపాటి ఇటీవల ప్రకటించాడు.

అయితే బాలీవుడ్‌కు చెందిన ఓ కొత్త బ్యూటీని ఈ సినిమాలో హీరోయిన్‌గా పరిచయం చేసేందుకు బోయపాటి రెడీ అవుతున్నాడట.

మరి బాలయ్యతో రొమాన్స్ చేసే ఆ బ్యూటీ ఎవరనే విషయం తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు చిత్ర యూనిట్.కాగా ఈ సినిమాకు మోనార్క్, సూపర్ మ్యాన్ అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి.

ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

#Heroine #Balakrishna #Boyapati Sreenu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Balakrishna Boyapati Sreenu Thaman Related Telugu News,Photos/Pics,Images..