#BB3 ఫస్ట్ రోర్: పంచకట్టుతో పిచ్చెక్కించిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు అదిరిపోయే రీతిలో బాలయ్య గిఫ్ట్ అందించాడు.ఈ సినిమాలోని టీజర్‌ను సడెన్ సర్‌ప్రైజ్‌గా రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, ఈ సినిమాతో బాలయ్య మరోసారి తనదైన మార్క్ వేయడం పక్కా అని ఎందుకు అంటున్నారో ఈ టీజర్ ద్వారా నిరూపించారు.

 Balakrishna Boyapati Sreenu Movie First Roar Teaser Very Impressive-TeluguStop.com

బాలయ్య-బోయపాటి కాంబో అంటే బాక్సాఫీస్‌కు ఎందుకు భయమో మరోసారి ఈ టీజర్ నిరూపించింది.

ఇక #BB3 ట్యాగ్‌తో ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్, ఓ పవర్‌ఫుల్ టీజర్‌ను వదిలారు.

ఈ టీజర్‌లో బాలయ్య పంచకట్టుతో ఎంట్రీ ఇచ్చేటప్పుడు థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు గూస్‌బంప్స్ రావడం ఖాయం.ఇక బాలయ్య ఎంట్రీతోనే యాక్షన్‌తో అదరగొట్టాడు.బాలయ్య తనదైన స్టయిల్‌లో ఇచ్చే ఆ వార్నింగ్‌కు ప్రత్యర్ధులు పంచలు తడుపుకోవడం ఖాయం.ఈ డైలాగ్‌ను బోయపాటి మార్క్‌కు అనుగుణంగా పక్కా మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసి బాలయ్య చెప్పిన విధానం సూపర్.

మొత్తానికి బాలయ్య ఈసారి అదిరిపోయే సినిమాతో ప్రేక్షకుల మందుకు రానున్నట్లు ఈ టీజర్ చూస్తే తెలుస్తోంది.కాగా బాలయ్య విశ్వరూపంలో ఇది శాంపిల్ మాత్రమే అని, అసలు సినిమా మున్ముందు ఉందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

ఇక ఈ టీజర్ అల్టిమేట్‌గా ఉండటంతో నందమూరి అభిమానులు అప్పుడే సినిమా 100 రోజులు ఆడినంత పండగ చేస్తున్నారు.ఓవరాల్‌గా చూస్తే, ఈ రోజు బాలయ్య తన అభిమానుల ఆకలిని పూర్తిగా తీర్చేశాడని చెప్పాలి.

మరి బాలయ్య సింహగర్జనను మీరు ఓసారి చూడండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube