బాలయ్య దెబ్బకు జడుసుకున్న జక్కన్న

నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుందంటే మాస్ ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంటారు.ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్‌కు మాత్రం అది నిజమైన పండగే అని అంటారు సినీ జనం.

 Balakrishna Boyapati Movie To Replace Rrr-TeluguStop.com

అలాంటిది మాస్ చిత్రాలకు కేరాఫ్‌గా పిలవబడే దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య సినిమా అంటే ఏ రేంజ్ హిట్ అవుతుందో సింహా, లెజెండ్ సినిమాలతో మనం ఇదివరకే చూశాం.

కాగా ఇప్పుడు ఈ కాంబో ముచ్చటగా మూడోసారి టాలీవుడ్ బాక్సాఫీస్‌తో చెడుగుడు ఆడేందుకు రెడీ అవుతున్నారు.

బాలయ్య తన తాజా చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తు్న్న విషయం తెలిసిందే.ఈ ఇద్దరూ కూడా బ్లాక్‌బస్టర్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.దీంతో వీరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆశగా చూస్తున్నారు.

అయితే తెలుగులో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్‌ను దర్శకుడు రాజమౌళి జూలై 30 నుంచి అక్టోబర్‌కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

ఇదే అదనుగా భావించిన బాలయ్య జూలై 30న తన సినిమాను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.ఏదేమైనా బాలయ్య వస్తున్నాడని రాజమౌళి కూడా పక్కకు తప్పుకున్నాడంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు.

కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం ఇంకా చిత్ర యూనిట్ రివీల్ చేయలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube