ఎట్టకేలకు బాలయ్య మొదలుపెట్టాడు!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను గతంలోనే ప్రారంభించినా రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలుకాలేదు.

 Balakrishna Boyapati Movie Shooting Started-TeluguStop.com

దీంతో ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే కొన్ని కారణాల వల్ల వరుసగా చిత్ర షూటింగ్ వాయిదా పడుతూ రావడంతో నందమూరి ఫ్యాన్స్ చాలా నిరాశకు లోనయ్యారు.

కాగా ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ సోమవారం ప్రారంభమైంది.రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఓ సెట్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ సినిమా షూటింగ్‌ను చిత్ర యూనిట్ ప్రారంభం అయ్యింది.

ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను ఫైట్ మాస్టర్‌లు రామ్ లక్ష్మణ్‌లు కొరియోగ్రాఫ్ చేస్తున్నారు.

మొత్తానికి బాలయ్య తన సినిమా షూటింగ్‌ను ప్రారంభించడంతో నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తాడు.ఇందులో ఒకటి ఫ్యాక్షనిస్ట్ పాత్ర కాగా మరొకటి అఘోరా పాత్ర అని తెలుస్తోంది.

ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారా అనే అంశం ఆసక్తికరంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube