నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన లేటెస్ట్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టేందుకు బాలయ్యతో పాటు బోయపాటి ప్రయత్నిస్తున్నాడు.
కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో మనకు కనిపిస్తాడని చిత్ర యూనిట్ తెలిపింది.
అయితే ఈ సినిమాతో మరోసారి లెజెండ్, సింహా తరహా సక్సెస్ అందుకోవాలని బోయపాటి ప్రయత్నిస్తున్నాడు.
ఈ క్రమంలో బాలయ్య కోసం ఓ అదిరిపోయే స్క్రిప్టును రెడీ చేశాడట.అయితే ఈ సినిమాలో మరోసారి బాలయ్యతో పవర్ఫుల్ పొలిటికల్ డ్రామాను తెరకెక్కించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రెండు గెటప్లలో బాలయ్య నటించనున్నట్లు చిత్ర యూనిట్ మొదట్నుండీ తెలుపుతూ వస్తోంది.ఒకటి అఘోరా పాత్ర కాగా మరోటి పొలిటీషియన్ పాత్రలో నటిస్తున్నాడు.
కాగా ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా వస్తుందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని చిత్ర దర్శకుడు బోయపాటి తెలిపాడు.ఈ సినిమా పొలిటికల్ డ్రామా కాదని, పూర్తి ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతుందని బోయపాటి తెలిపాడు.
మొత్తానికి ఈ సినిమాతో మరోసారి బాలయ్య తన సత్తా చాటడం ఖాయమని బోయపాటి ధీమా వ్యక్తం చేస్తున్నాడు.