బాలయ్య సినిమా అప్పుడే బిజినెస్ క్లోజ్ చేసిందా?  

Balakrishna Boyapati Movie Business In Full Swing, Balakrishna, Boyapati Sreenu, BB3, Digital Rights, Satellite Rights - Telugu Balakrishna, Bb3, Boyapati Sreenu, Digital Rights, Satellite Rights

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే సక్సెస్ అందుకునేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడు.

TeluguStop.com - Balakrishna Boyapati Movie Business In Full Swing

కాగా తనకు గతంలో సింహా, లెజెండ్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను కూడా ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేయడంతో ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.దీంతో ఈ సినిమా షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

TeluguStop.com - బాలయ్య సినిమా అప్పుడే బిజినెస్ క్లోజ్ చేసిందా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే ఈ సినిమా షూటింగ్ జరుపుకోకపోయినా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త తెగ చక్కర్లు కొడుతోంది.బాలయ్య నటిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రానికి భారీ క్రేజ్ ఏర్పడిన నేపథ్యంలో ఈ సినిమా డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ కొనుగోలు విషయంలో తీవ్ర పోటీ నెలకొందని తెలుస్తోంది.ఇప్పటికే ఈ చిత్ర డిజిటల్ రైట్స్ రూ.9 కోట్ల భారీ రేటుకు అమ్ముడు కాగా, తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను జెమిని టీవీ భారీ రేటుకు కొనుగోలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి బోయపాటి-బాలకృష్ణ నటిస్తున్న ఈ మాస్ చిత్రం అప్పుడే బిజినెస్ క్లోజ్ చేసిందనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా షూటింగ్ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.

మరి బాలయ్య ఈ సినిమాలో ఎవరితో రొమాన్స్ చేస్తాడా అనేది చూడాలి.

#Digital Rights #Balakrishna #Boyapati Sreenu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Balakrishna Boyapati Movie Business In Full Swing Related Telugu News,Photos/Pics,Images..