ఉగాదికి రాబోతున్న బాలయ్య బోయపాటి BB3 టైటిల్..

నందమూరి అభిమానులు బాలయ్య సినిమా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు.

 ఉగాదికి రాబోతున్న బాలయ్య బోయపాటి Bb3 టైటిల్..-TeluguStop.com

ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తి అయినా ఇంకా సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో నందమూరి అభిమానులు నిరాశలో ఉన్నారు.అయితే ఇప్పుడు బాలయ్య అభిమానులకు అదిరిపోయే శుభవార్త తెలిపాడు.

బాలయ్య, బోయపాటి కాంబినేషన్ అంటే పెద్ద అంచనాలే ఉన్నాయి.ఇంతకు ముందు వీరి కాంబినేషన్ లో సింహ, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి.ఇప్పుడు చేయబోయే సినిమా కూడా హిట్ అయితే హ్యాట్రిక్ సినిమాను తమ ఖాతాలో వేసుకుంటారు.తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

 ఉగాదికి రాబోతున్న బాలయ్య బోయపాటి BB3 టైటిల్..-ఉగాదికి రాబోతున్న బాలయ్య బోయపాటి BB3 టైటిల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Balakrishna, Balakrishna Boyapati Bb3 Title Announcement For Ugadi, Bb3 Title Announcement, Boyapati Srinu, Ugadi-Movie

ఉగాది కానుకగా ఏప్రిల్ 13 మధ్యాహ్నం 12 గంటల 33 నిముషాలకు BB3 సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.ఈ సినిమా టైటిల్స్ విషయంలో ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి.ప్రధానంగా మోనార్క్ , గాడ్ ఫాదర్ అనే పేర్లు బాగా వినిపిస్తున్నాయి.మరి చూడాలి బోయపాటి ఏ పేరు అనౌన్స్ చేస్తారో.

ఇది ఇలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సయేశా సైగల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

పూర్ణ ఒక కీలక పాత్రలో నటిస్తుంది.విలన్ రోల్ లో కోలీవుడ్ స్టార్ శరత్ కుమార్ ను ఫైనల్ చేసినట్టు సమాచారం అందుతుంది.

ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాను మే 28 న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

#Ugadi #Boyapati Srinu #BB3Title #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు