70 కోట్లు బిజినెస్‌ చేసి 20 కోట్లు వసూళ్లు చేస్తే డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటీ...?

నందమూరి తారక రామారావు బయోపిక్‌ ‘ఎన్టీఆర్‌’ రెండు పార్ట్‌లు కూడా దారుణమైన కలెక్షన్స్‌ నమోదు చేశాయి.మొదటి పార్ట్‌ కాస్త పర్వాలేదు.

 Balakrishna Bothering About Ntr Mahanayakudu Distributors-TeluguStop.com

మొదటి వారం రోజులు బాగానే ఆడటంతో 20 కోట్ల వరకు వసూళ్లు చేసింది.రెండవ పార్ట్‌ కనీసం 5 కోట్లను కూడా రాబట్టిన దాఖలాలు కనిపించడం లేదు.‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ మూవీపై వచ్చిన అంచనాల నేపథ్యంలో సినిమాను అన్ని ఏరియాలకు కలిపి చిత్ర నిర్మాత బాలకృష్ణ ఏకంగా 70 కోట్లకు అమ్మేశాడు.ముఖ్యంగా నైజాం ఏరియాలో 13 కోట్లు, సీడెడ్‌లో 11 కోట్లు, ఆంధ్రా మొత్తం 30 కోట్లకు సినిమా అమ్ముడు పోయింది.

ఓవర్సీస్‌లో ఈ చిత్రాన్ని 10 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు.

కేవలం మహానాయకుడు సినిమాకు ఇంత భారీగా నిర్మాత బాలయ్య డిస్ట్రిబ్యూటర్ల నుండి వసూళ్లు చేశాడు.అన్ని ఏరియాల్లో కలిపి దాదాపుగా 70 కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్ల నుండి తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ప్రేక్షకుల నుండి మాత్రం 20 కోట్లు కూడా రాబట్టలేకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లు 50 కోట్ల మేరకు నష్టపోయాడు.వారికి మొదట నష్టపరిహారం ఇస్తానంటూ బాలయ్య హామీ ఇచ్చాడు.50 కోట్లలో సగం అంటే 25 కోట్లు వెనక్కు ఇస్తానంటూ హామీ ఇచ్చాడు.మహానాయకుడు సినిమాను సొంతంగా విడుదల చేసి, వచ్చిన డబ్బును వారికి ఇవ్వాలనుకున్నాడట.

కాని మహానాయకుడు మహా దారుణంగా కేవలం అయిదు కోట్ల వసూళ్లు మాత్రమే నమోదు చేసింది.

ఈ నేపథ్యంలో బాలకృష్ణ డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు ఇవ్వలేను అంటూ చేతులు ఎత్తేసినట్లుగా తెలుస్తోంది.దాంతో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర స్థాయిలో ఒత్తిడిని తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.ఒత్తిడి తీసుకు వచ్చి తమకు ఇవ్వాల్సిన డబ్బును తిరిగి తెచ్చుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు.

ఒకవేళ ఇప్పుడు సెటిల్‌ చేయకుంటే బాలయ్య వచ్చే సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.మర ఈ పరిస్థితుల్లో బాలయ్య ఏం చేస్తాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube