ఇంతేనా.. బాలయ్య బర్త్‌ డే అప్ డేట్‌ పై ఫ్యాన్స్ రియాక్షన్‌

నందమూరి అభిమానులు గత కొన్ని వారాలుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది.మరి కొన్ని గంటల్లో బాలయ్య బర్త్‌ డే.

 Balakrishna Birthday Akhanda Poster Not Interested-TeluguStop.com

కరోనా కారనంగా ఎలాంటి హడావుడి వద్దన్న బాలయ్య తన అఖండ సినిమా నుండి బిగ్‌ అప్ డేట్‌ ఇస్తాడని భావించారు.కాని అనూహ్యంగా బాలయ్య అఖండ సినిమా సింపుల్‌ పోస్టర్‌ ను మాత్రమే విడుదల చేసి నిరాశ పర్చాడు.

ఏమాత్రం ఆకట్టుకోని విధంగా బాలయ్య లుక్ ఉందంటూ కొందరు అంటూ ఉంటే కొందరు మాత్రం ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నది దీనికోసమేనా.ఇంతేనా అంటూ సింపుల్‌ గా తేల్చి పారేస్తున్నారు.

 Balakrishna Birthday Akhanda Poster Not Interested-ఇంతేనా.. బాలయ్య బర్త్‌ డే అప్ డేట్‌ పై ఫ్యాన్స్ రియాక్షన్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలయ్య అఖండ సినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్‌ లు మరియు వీడియోలు వచ్చాయి.కనుక ఇది పెద్దగా ఆకట్టుకోవడం లేదు అంటున్నారు.

ఇక బాలయ్య బర్త్‌ డే సందర్బంగా రేపు మరేమైనా అప్ డేట్‌ ఉంటుందా అనేది చూడాలి.

అఖండ సినిమా షూటింగ్ దాదాపుగా ముగింపు దశకు వచ్చింది.

గత నెలలోనే సినిమా షూటింగ్‌ పూర్తి చేసి విడుదల చేయాలని భావించినా కూడా కరోనా సెకండ్ వేవ్‌ కారణంగా వాయిదా వేశారు.ఇక క్రాక్‌ దర్శకుడు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా ను చేసేందుకు బాలయ్య ఓకే చెప్పాడు.

ఇప్పటికే సినిమా ఓకే అయ్యింది కాని అధికారికంగా మాత్రం ప్రకటన రాలేదు.బాలయ్య మరియు గోపీచంద్ ల కాంబో మూవీ రేపు అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.

Telugu Akhanda, Akhanda Shooting Update, Balakrishna, Balayya And Gopichand Malineni Mvoie, Balayya Birthday Update, Film News, Gopichand Movie, Movie News, News In Telugu-Movie

టైటిల్ ను కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది.కాని బాలయ్య అఖండ నుండి వస్తుందని భావించిన టీజర్ రాకపోవడంతో గోపీచంద్‌ మూవీ గురించిన అప్‌ డేట్ అయినా వస్తుందా లేదో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.కరోనా సమయంలో తమ బర్త్‌ డే కు సంబంధించి ఎలాంటి అప్ డేట్‌ ఇవ్వాలని కోరుకోవడం లేదని హీరోలు అంటున్నారు.ఇప్పుడు బాలయ్య కూడా కూడా అదే తరహా లో తన సినిమా అప్ డేట్ ఇవ్వడం లేదు.

#BalayyaAnd #BalayyaBirthday #AkhandaShooting #Balakrishna #Akhanda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు