ఆ పాత్రలో నటించిన బాలయ్య.. కానీ తీసేశారట..!

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తన సినీ కెరీర్ లో ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.ప్రస్తుత కాలంలో పౌరాణిక పాత్రల్లో నటించి మెప్పించగల నటుల్లో బాలకృష్ణ కూడా ఒకరు.

 Balakrishna Bhishma Look Photos Goes Viral In  Social Media,latest Tollywood New-TeluguStop.com

సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల్లో బాలకృష్ణ నటించిన సంగతి తెలిసిందే.అయితే ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ పోషించిన ఎన్నో పాత్రలలో కనిపించారు.అయితే ఆ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పోషించిన భీష్ముని పాత్రలో కూడా బాలకృష్ణ నటించగా సినిమాలో మాత్రం ఆ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు లేవు.

సినిమా నిడివి పెరగడంతో ఆ పాత్ర సన్నివేశాలను తొలగించారు.అందువల్ల అభిమానులు బాలయ్యను భీష్మునిగా చూడలేకపోయారు.

Telugu Balakrishna, Bhishma-Movie

అయితే నిన్న భీష్మ ఏకాదశి కావడంతో బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా షూటింగ్ సమయంలో భీష్ముని పాత్రలో దిగిన ఫోటోలను షేర్ చేయడంతో పాటు ఆ పాత్ర పోషించడం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తనకు భీష్ముని పాత్ర అంటే ఎంతో ఇష్టమని.ఆ కారణం వల్లే ఎన్టీఆర్ కథానాయకుడు షూటింగ్ లో భాగంగా భీష్ముని పాత్రలో నటించానని అన్నారు.

సినిమాలో ఆ సన్నివేశాలను ఉంచడం సాధ్యం కాకపోవడం వల్ల అభిమానులతో భీష్ముని పాత్రకు సంబంధించిన ఫోటోలను పంచుకుంటున్నానని తెలిపారు.

భీష్ముని లుక్ లో బాలకృష్ణ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఆ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఉండి ఉంటే బాగుండేదని బాలకృష్ణ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు.మరోవైపు బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నారు.

ఈ మూవీ విడుదలైన తర్వాత క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో బాలకృష్ణ నటించనున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube