అబిడ్స్ లోని ఆ ఇంట్లోకి అడుగుపెట్టగానే కన్నీరు పెట్టుకున్న బాలయ్య.! ఆయనకి ఆ ఇంటితో అనుబంధం ఏంటి.?  

  • బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ తెరకెక్కిస్తున్న “ఎన్ఠీఆర్ బయోపిక్” పై తెలుగు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రం రెండు భాగాల్లో నిర్మిస్త్తున్నారు. మొదటి భాగం ఎన్ఠీఆర్ సినీ జీవితం గురించి…రెండో భాగం రాజకీయ జీవితం గురించి. ఇప్పటికే ఈ చిత్రంపై సంబందించిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. నారా చంద్రబాబు గా రానా దగ్గుబాటి, అక్కినేని నాగేశ్వర రావు గారి లాగా సుమంత్, హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు. బాలకృష్ణ పాత్రలో తారక్ నటిస్తున్నారు.?

  • Balakrishna Attachment With Abids House-

    Balakrishna Attachment With Abids House

  • అయితే తాజాగా ఎన్టీఆర్ కు సంభందించిన మ‌రొక వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. సినిమా షూటింగ్ అధిక బాగం ఆ ఇంట్లో జ‌రుగుతోంద‌ట‌. అప్ప‌ట్లో ఎన్టీఆర్ దాదాపు ద‌శాబ్ధానికి పైగా అబిడ్స్ లో ఓ ఇంట్లో ఉన్నారట‌. బంజారా హిల్స్ లో నివసించడానికి ముందు అబిడ్స్ లో ఉన్నారంట. ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితం మొద‌లు పెట్టింది ఆ ఇంటినుండే అంట. ఈ నేప‌థ్యంలో వాటికి సంబంధించిన సన్నివేశాల‌ను క్రిష్ ప్ర‌స్తుతం అక్క‌డే చిత్రీక‌రిస్తున్నారు. ఇప్ప‌టికే కొన్ని స‌న్నివేశాల‌ను బాల‌య్య పై అక్క‌డ చిత్రీక‌రంచారు.

  • Balakrishna Attachment With Abids House-
  • అయితే బాల‌య్య తొలి రోజు ఆ ఇంట్లో అడుగు పెట్ట‌గానే భావోద్వేగానికి లోనయ్యారంట. తండ్రి నివ‌సించిన ఇంటిలో కాలు పెట్ట‌గానే ఒక్క‌సారిగా కన్నీళ్లు వచ్చాయి. తండ్రితో ఉన్న అనుభూతుల‌ను…అనుభ‌వాల‌ను గుర్తు చేసుకుని క‌న్నీటి ప‌ర్యంతం చెందారు. ఇటీవ‌లే ఆ ఇంట్లో షూటింగ్ ప్రారంభ‌మైన నేప‌థ్యంలో భ‌ద్ర‌తా స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశం ఉండ‌టంతో అద‌నంగా సిబ్బందిని పెంచి షూటింగ్ చేస్తున్నారట‌.

  • Balakrishna Attachment With Abids House-