ఫ్యాన్స్ కు ఇక పూనకాలే.. అనిల్ - బాలయ్య కాంబోపై లేటెస్ట్ అప్డేట్!

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను దరకత్వంలో చేసిన అఖండ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి అఖండమైన విజయం అందుకుంది.ఈ సినిమాతో పాత రికార్డులను కూడా చెరిపేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసారు.

 Balakrishna Anil Ravipudi Film Latest Update, Anil Ravipudi , Balakrishna, F3 Movie, Gopichand Malineni , Shruti Haasan , Nbk108 , Anil Ravipudi Film-TeluguStop.com

ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడు.ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాను స్టార్ట్ చేసాడు.

 ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.మైత్రి మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ యువ దర్శకుడు హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.

 Balakrishna Anil Ravipudi Film Latest Update, Anil Ravipudi , Balakrishna, F3 Movie, Gopichand Malineni , Shruti Haasan , NBK108 , Anil Ravipudi Film-ఫ్యాన్స్ కు ఇక పూనకాలే.. అనిల్ #8211; బాలయ్య కాంబోపై లేటెస్ట్ అప్డేట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇటీవలే బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేసారు. టీజర్ ను బట్టి ఈ సినిమా పులిచర్ల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా అనిపిస్తుంది.

ఇది పక్కన పెడితే ఈ సినిమా తర్వాత బాలయ్య తన 108 వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నాడు.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి ప్రెసెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.

ఇటీవలే అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్ 3′ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది.ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వడంతో ఇప్పుడు అనిల్ ఫుల్ కాన్సంట్రేషన్ బాలయ్య సినిమాపై పెట్టాడు.

ఈ సినిమాలో బాలయ్య 50 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి పాత్రలో సరికొత్త లుక్ లో కనిపించనున్నారు.ఈ సినిమాలో ఈయన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట.

ఈయన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించ బోతున్నారని ఆయన పాత్ర తీర్చిదిద్దిన తీరు ఆశ్చర్యంగా ఉండడం ఖాయం అంటున్నారు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య ఈ పాత్ర కోసం సరికొత్త మేకోవర్ లో కనిపించ బోతున్నాడని.ఈయన లుక్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటుంది అని.నందమూరి ఫ్యాన్స్ కు పూనకాలే అని అనిల్ చెబుతున్నాడు.ప్రెసెంట్ అనిల్ బాలయ్య లుక్ ను ఇంకాస్త మెరుగులు దిద్దుతున్నాడని.అసలు బాలయ్య పుట్టిన రోజు నాడే ఈయన ఫస్ట్ లుక్ రిలీజ్ అవ్వాల్సి ఉండగా.పూర్తి స్థాయిలో లుక్ పర్ఫెక్ట్ అవ్వలేదని అందుకే రివీల్ చెయ్యలేదని తెలుస్తుంది.మరి బాలయ్య మాస్ లుక్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపించనుందని.హీరోయిన్ గా ప్రియమణి అని వార్తలు వస్తున్నాయి.

షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube