వామ్మో.. బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ బడ్జెట్ అన్ని కోట్ల రూపాయలా?

బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే.అటు బాలయ్య ఇటు అనిల్ రావిపూడిలకు వేర్వేరుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది.

 Balakrishna Anil Ravipudi Combo Movie Budget Details, Balakrishna, Anil Ravipudi, Thaman, Balayya Anil Ravipudi Combo, Tollywood, Akhanda, Balayya Movie Budget, Jai Balayya-TeluguStop.com

ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని గతంలోనే వార్తలు ప్రచారంలోకి రాగా ఈ సినిమా బడ్జెట్ గురించి తెలిసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు.

బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.అటు బాలయ్య ఇటు అనిల్ రావిపూడి ప్రస్తుతం సక్సెస్ లో ఉన్నారు.

 Balakrishna Anil Ravipudi Combo Movie Budget Details, Balakrishna, Anil Ravipudi, Thaman, Balayya Anil Ravipudi Combo, Tollywood, Akhanda, Balayya Movie Budget, Jai Balayya-వామ్మో.. బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ బడ్జెట్ అన్ని కోట్ల రూపాయలా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలయ్య సినిమా అంటే మూవీలో భారీ యాక్షన్ సన్నివేశాలు తప్పనిసరిగా ఉండాలనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం జై బాలయ్య సినిమాలో నటిస్తున్న బాలకృష్ణ ఈ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే తర్వాత సినిమా షూటింగ్ పనులను మొదలుపెట్టనున్నారు.

అఖండ సినిమా నుంచి వరుసగా బాలయ్య సినిమాలకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

Telugu Crore Rupees, Akhanda, Anil Ravipudi, Balakrishna, Balayyaanil, Balayya Budget, Jai Balayya, Budget, Thaman, Tollywood-Movie

అఖండ బీజీఎంకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో బాలయ్య సైతం థమన్ కు ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ తెరకెక్కనుంది.బాలయ్య కెరీర్ లో ఈ స్థాయి బడ్జెట్ తో ఇప్పటివరకు మరే సినిమా తెరకెక్కలేదు.

Telugu Crore Rupees, Akhanda, Anil Ravipudi, Balakrishna, Balayyaanil, Balayya Budget, Jai Balayya, Budget, Thaman, Tollywood-Movie

బాలయ్య సినిమాలకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తున్న నేపథ్యంలో నిర్మాతలు సైతం భారీ బడ్జెట్ కు అంగీకారం తెలిపారని బోగట్టా.అఖండ 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కినా ఆ సినిమా నిర్మాతలకు 20 కోట్ల రూపాయల రేంజ్ లో లాభాలు వచ్చాయి.బాలయ్య అనిల్ రావిపూడి మూవీకి 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.ఈ సినిమాలో బాలయ్య కూతురి రోల్ లో శ్రీలీల కనిపించనున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube