రామారావుగా పవర్ చూపిస్తానంటోన్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ

కొంత గ్యాప్ తరువాత మాస్ చిత్రాల

దర్శకుడు బోయపాటి శ్రీను

డైరెక్షన్‌లో సినిమా చేయనున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు.

 Balakrishna To Work With Anil Ravipudi For Ramarao, Balakrishna, Anil Ravipudi,-TeluguStop.com

అందులో ఒకటి అఘోరా పాత్ర అని తెలుస్తోంది.ఈ సినిమాతో మరోసారి బాలయ్య అదిరిపోయే హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని కూడా లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు బాలయ్య.ఇప్పటికే పలువురు డైరెక్టర్ల కథలు కూడా వింటున్నాడట.అయితే బాలయ్యతో ఎప్పటికైనా సినిమా చేస్తానని గతంలో చెప్పాడు

దర్శకుడు అనిల్ రావిపూడి

.ప్రస్తుతం

ఎఫ్2 సీక్వెల్‌ ఎఫ్3

కోసం రెడీ అవుతున్న అనిల్ రావిపూడి, బాలయ్య కోసం ఓ పవర్‌ఫుల్ స్టోరీలైన్ రెడీ చేసి పెట్టాడట.

ఈ సినిమాకు

రామారావు

అనే టైటిల్‌ను కూడా పెట్టాడట.

ఈ సినిమాలో బాలయ్య పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని,

నందమూరి ఫ్యాన్స్‌

కు నిజమైన పండగలా ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో బాలయ్య వారుసడి ఎంట్రీకి కూడా అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాను వీలైనంత త్వరలో బాలయ్యతో కలిసి పట్టాలెక్కించేందుకు అనిల్ రావిపూడి రెడీ అవుతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube