రిస్క్ లేకుండా బాలయ్య మూవీ బడ్జెట్‌ ప్లాన్‌ చేస్తున్న మలినేని

ఈమద్య కాలంలో చిన్న దర్శకులు కూడా పెద్ద బడ్జెట్‌తో సినిమాలు చేస్తూ చేతులు కాల్చుకుంటున్నారు.కాని గోపీచంద్‌ మలినేని మాత్రం అలా కాదు.

 Balakrishna And Gopichand Malineni Movie Budget News ,balakrishna, Gopichand Mal-TeluguStop.com

తన స్థాయికి తగ్గట్లుగా కాకుండా ఇంకా తక్కువ బడ్జెట్‌తోనే సినిమాను ప్లాన్‌ చేసుకుంటాడు.హీరో ఇమేజ్ కు తగ్గట్లుగా అంటూ భారీగా ఖర్చు పెట్టించకుండా తక్కువ ఖర్చుతో సినిమాలు తీస్తూ నిర్మాతలకు లాభాలు కలిగేలా చేస్తున్నాడు.

ప్రస్తుతం గోపీచంద్ మలినేని స్టార్‌ హీరో బాలకృష్ణ కోసం స్క్రిప్ట్‌ ను రెడీ చేస్తున్నాడు.గత చిత్రం క్రాక్ సక్సెస్‌ నేపథ్యంలో ఈ సినిమాకు భారీగా ఖర్చు చేస్తున్నారనే వార్తలు వచ్చాయి.

కాని తాజాగా గోపీచంద్‌ సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు.మీడియాలో వస్తున్నట్లుగా బాలయ్య మూవీకి గోపీచంద్‌ భారీగా ఖర్చు చేయడం లేదంటూ స్పష్టత ఇచ్చాడు.

బాలయ్య మూవీ అయినా కూడా ఎంత అవసరం అవుతుందో అంతే ఖర్చు చేస్తాడట.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య పారితోషికం కాకుండా 15 నుండి 20 కోట్లలోనే ఈ సినిమా నిర్మాణం ను పూర్తి చేస్తారని తెలుస్తోంది.

భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను అంత తక్కువ బడ్జెట్‌ లో రూపొందినా కూడా ఎక్కడ ఏ లోటు కనిపించకుండా గోపీచంద్‌ జాగ్రత్త పడబోతున్నాడట.క్రాక్ సినిమాను కేవలం 15 కోట్లతోనే పూర్తి చేశాడట.

సినిమా సక్సెస్ అవ్వడంతో భారీగా లాభాలు దక్కినట్లుగా చెబుతున్నారు.అందుకే బాలయ్య సినిమా విషయం లో కూడా దర్శకుడు గోపీచంద్‌ అదే ప్లాన్‌ వేశాడట.

ప్రస్తుతం బాలయ్య మార్కెట్‌ నేపథ్యంలో ఆయనపై పాతిక కోట్ల వరకు పెట్టడం సేఫ్ అంతకు మించి పెడితే ప్రయోగం.ప్రయాస అవుతుందని ఆయనకు తెలుసు.

అందుకే గోపీచంద్‌ మలినేని చాలా తెలివిగా రిస్క్ లేకుండా సింపుల్ గా బాలయ్య ఇమేజ్ కు తగ్గట్లుగా బడ్జెట్‌ ను ప్లాన్ చేస్తున్నాడు.మరో రెండు నెలల్లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

అప్పటి వరకు ఈ సినిమా గురించి మరెన్ని వార్తలు వస్తాయో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube