బాలయ్యను దాటేసిన బోయపాటి.. నిర్మాత పరిస్థితి ఏమిటో?  

Balakrishna And Boyapati Srinu Remunerations-boyapati Srinu,miryala Ravinder Reddy,nbk106,remuneration

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం రూలర్ రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బాలయ్య మరోసారి హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్.

Balakrishna And Boyapati Srinu Remunerations-boyapati Srinu,miryala Ravinder Reddy,nbk106,remuneration Telugu Tollywood Movie Cinema Film Latest News-Balakrishna And Boyapati Srinu Remunerations-Boyapati Miryala Ravinder Reddy Nbk106 Remuneration

అయితే ఈ సినిమా రిలీజ్‌కు ముందే బాలయ్య తన నెక్ట్స్ మూవీని లైన్‌లో పెట్టాడు.మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించనున్నాడు.

ఈ సినిమాను ఇటీవల అధికారికంగా ప్రారంభించారు.అయితే ఈ సినిమాలో బాలయ్య రెమ్యునరేషన్ రూ.10 కోట్లు అని తెలుస్తోంది.బాలయ్య కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అని చెప్పాలి.ఇక దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమా కోసం తీసుకుంటున్న రెమ్యునరేషన్ రూ.15 కోట్లు.

అంటే బాలయ్య కంటే కూడా 5 కోట్లు ఎక్కువ.బాలయ్య కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న బోయపాటి ఎలాంటి సబ్జెక్టుతో వస్తాడా అని నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

బాలయ్య-బోయపాటి సినిమాకు నిర్మాత కేటాయించిన బడ్జెట్ రూ.70 కోట్లకు చేరుతుందని, అందుకే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తప్పుకుంది.

ఇప్పుడు ఈ సినిమా మిర్యాల రవీందర్ రెడ్డి చేతిలోకి వెళ్లింది.మరి బాలయ్య సినిమాకు రూ.70 కోట్లు అంటే కాస్త ఆలోచించాల్సిందే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.

తాజా వార్తలు