సైలెంట్‌ గా బాలయ్య మొదలు పెట్టాడు.. సీక్రెట్‌ గా ఎందుకో?- Balakrishna And Boyapati Srinu Movie Shooting Pragya Jaiswal

balakrishna and boyapati srinu movie shooting updates ,balakrishna, boyapati,pragya jaiswal, saradhi studio, bb3 movie,balakrishna with pragya jaiswal - Telugu Balakrishna, Balakrishna And Boyapati Srinu Movie Shooting Updates, Balakrishna With Pragya Jaiswal, Bb3 Movie, Boyapat, Boyapati, Pragya Jaiswal, Saradhi Studio, Simha Movie

నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న సినిమా షూటింగ్ విషయమై ప్రస్తుతం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించిన సింహా మరియు లెజెండ్‌ సినిమాలకు దర్శకత్వం వహించిన బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

 Balakrishna And Boyapati Srinu Movie Shooting Pragya Jaiswal-TeluguStop.com

వీరిద్దరి కాంబోలో ఖచ్చితంగా హ్యాట్రిక్‌ అంటున్నారు.ప్రస్తుతం సినిమా షూటింగ్‌ జరగడం లేదని ఇన్ని రోజులు అంతా అనుకున్నారు.

ముఖ్యంగా షూటింగ్ కోసం అభిమానులు ఎదురు చూస్తూ వస్తున్నారు.బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా అంటే భారీ యాక్షన్‌ సీన్స్‌ ఉంటాయి.

 Balakrishna And Boyapati Srinu Movie Shooting Pragya Jaiswal-సైలెంట్‌ గా బాలయ్య మొదలు పెట్టాడు.. సీక్రెట్‌ గా ఎందుకో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అది బాలయ్యతో అంటే మాస్ అభిమానులకు పండుగే అనడంలో సందేహం లేదు.అందుకే ఈ సినిమా ఖచ్చితంగా భారీ గా వసూళ్లు సాధిస్తుందని అనుకుంటున్నారు.

ఈ సినిమా కరోనా కారణంగా గత సమ్మర్‌ లో షూటింగ్‌ నిలిచి పోయింది.మళ్లీ షూటింగ్ పునః ప్రారంభం ఎప్పుడు అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు.సహజంగా అన్ని సినిమాలు కూడా షూటింగ్ ప్రారంభం అవుతున్న సమయంలో సోషల్‌ మీడియాలో చెప్పుకొచ్చారు.కాని బాలయ్య బోయపాటి లు తమ సినిమా షూటింగ్‌ అప్‌ డేట్‌ ను ఇవ్వక పోవడంతో అసలు సినిమా షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభం అవుతుందో అర్థం కాకుండా ఉంది.

అయితే సారధి స్టూడియోలో సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యిందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ మరియు ఇతర విషయాల్లో క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ గా ఒక్కసారిగా చెప్పాలని ఏమైనా బోయపాటి భావిస్తున్నాడా లేదంటే ఎందుకు ఇంత సీక్రెట్‌ షూటింగ్‌ ఎందుకు అంటూ అభిమానులు మరియు నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం సారధి స్టూడియోలో ప్రగ్యా జైస్వాల్‌ తో కలిసి బాలయ్య షూటింగ్ లో పాల్గొంటున్నాడు.ఒక మాస్ మసాలా సాంగ్‌ ను చిత్రీకరిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

#Boyapat #Pragya Jaiswal #Balakrishna #Boyapati #BalakrishnaAnd

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు