బాలయ్య మూవీలో ఇంకా ఎంత మంది యువ హీరోలు నటిస్తారా బాబోయ్‌!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబోలో వచ్చిన రెండు సినిమాలు సక్సెస్ అయిన కారణంగా మూడవ సినిమా పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.అయిదు సంవత్సరాలుగా వీరి హ్యాట్రిక్ మూవీ కోసం వెయిట్‌ చేస్తున్నారు.

 Balakrishna And Boyapati Srinu Movie Bb 3 Young Heroes Acting, Balakrishna, Bb3,-TeluguStop.com

ఎట్టకేలకు సినిమా పట్టాలెక్కింది.అయితే కరోనా కారణంగా గత ఏడాది రావాల్సిన మూవీ ఈ ఏడాది వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.

ఈ సినిమా లో ఒక యంగ్ పొలిటీషియన్ పాత్రకు యంగ్‌ హీరో ను ఎంపిక చేశారని వార్తలు వస్తున్నాయి.అయితే ఆ హీరో ఎవరు అనే విషయంలో మాత్రం చాలా రోజులుగా క్లారిటీ లేకుండా గందరగోళంగా ఉంది.

చాలా మంది యంగ్‌ హీరోల పేర్లు వినిపించాయి.నవీన్ చంద్ర నుండి మొదలుకుని నందమూరి కళ్యాణ్‌ రామ్‌, తారక రత్న మరియు మంచు మనోజ్ ల పేర్లు కూడా వినిపించాయి.

వీరు మాత్రమే కాకుండా ఇంకా పలువురి పేర్లు మీడియాలో ప్రచారం జరిగిన నేపథ్యంలో అసలు బిబి3 లో నటించే యంగ్‌ హీరో ఎవరై ఉంటారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బోయపాటి ఇంతకు మందు సినిమా ల్లో కీలక పాత్రల్లో యంగ్‌ హీరోలను నటింపజేసిన సందర్బాలు ఉన్నాయి.

అవి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి కనుక ఈ సినిమా కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందని అంటున్నారు.కాని ఆ యంగ్‌ హీరో ఎవరు అనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వక పోవడంతో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను మే నెలలో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుంది.ఇప్పటి వరకు సినిమా టైటిల్‌ ఏంటీ.సినిమాలో బాలయ్య లుక్‌ ఏంటీ అనే విషయాలపై స్పష్టత రాలేదు.

బాలయ్య ఈ సినిమాతో సక్సెస్ కొడుతాడనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

అలాగే ఆ యంగ్‌ హీరో ఎవరు అనే విషయంలో కూడా స్పష్టత రావాలంటే కొన్ని రోజులు ఆగాలంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube