బిబి3 టైటిల్ ఇంకా కన్ఫర్మ్‌ అంటూ వార్తలు.. అసలు విషయం ఏంటీ?

నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న మూడవ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది.

 Nandamuri Balakrishna And Boyapati Movie Title News, Balakrishna, Bb3, Boyapati,-TeluguStop.com

ఈ మూవీ టైటిల్‌ విషయమై గత కొన్ని రోజులుగా అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.ఎట్టకేలకు ఈ సినిమా యూనిట్‌ సభ్యుల నుండి క్లారిటీ వచ్చేసింది.

సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్‌ ను ఖరారు చేశారని ఇన్ని రోజులు ఆ టైటిల్ వేరే వారి వద్ద ఉండటం వల్ల తీసుకోవడానికి ఆలస్యం అయ్యిందని అంటున్నారు.ఎట్టకేలకు సినిమా టైటిల్ రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే టైటిల్‌ చాలా ఎఫెక్టివ్‌ గా మరియు ఆకట్టుకునే విధంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.ఇలాంటి సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.

బోయపాటి శ్రీను ఇప్పటి వరకు టైటిల్‌ ను ఖరారు చేయలేదు అంటున్నారు.

నందమూరి హీరో బాలకృష్ణ ఇమేజ్ కు తగ్గట్లుగా బోయపాటి సినిమా టైటిల్‌ ను ఖరారు చేయడం ఖాయం.

కాని అది ఏంటీ అనేది ఇప్పుడే చెప్పలేం అంటున్నారు.మోనార్క్‌ మరియు గాడ్ ఫాదర్ టైటిల్స్ ప్రముఖంగా వినిపిస్తున్నాయి.ఇలాంటి సమయంలో బిబి3 సినిమా టైటిల్‌ గురించి ఇండస్ట్రీ వర్గాల వరు చాలా ఆసక్తిని కనబర్చుతున్నారు.సినిమా టైటిల్‌ విషయమై చిత్ర యూనిట్‌ సభ్యులు ఉగాది సందర్బంగా అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంతకు సినిమా నేపథ్యం ఏంటీ అసలు సినిమా లో బాలయ్య ఏంటీ అనేది ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు.టైటిల్‌ మరియు టీజర్‌ ను విడుదల చేస్తే సినిమ ఏంటీ అనే విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

పెద్ద ఎత్తున రూపొందుతున్న ఈ సినిమా ను మిర్యాల రాజేందర్‌ నిర్మిస్తున్న విషయం తెల్సిందే.త్వరలోనే సినిమా చిత్రీకరణ పూర్తి అవ్వబోతుంది.

కనుక సినిమా ను మే లో ఖచ్చితంగా విడుదల చేయబోతున్నారని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube