రూలర్‌ ఫలితం తర్వాత బాలయ్య, బోయపాటి మూవీలో కీలక పరిణామం  

Balakrishna And Boyapati Movie Budjet Latest Update-balakrishna And Boyapati Hatrick Movie,balakrishna Rular Movie Flop,balakrishna Tollywood Hero,boyapati Srinu Legend And Simha

నందమూరి బాలకృష్ణ ఆలోచించి సినిమాలు చేస్తున్నాడో లేదా అనాలోచితంగా సినిమాలు చేస్తున్నాడో తెలియడం లేదు కాని వరుసగా అట్టర్‌ ఫ్లాప్స్‌ అవుతున్నాయి.ఆయన ఏ సినిమా చేసినా కూడా ఈ మద్య నిరాశ పర్చుతున్నాయి.

Balakrishna And Boyapati Movie Budjet Latest Update-balakrishna And Boyapati Hatrick Movie,balakrishna Rular Movie Flop,balakrishna Tollywood Hero,boyapati Srinu Legend And Simha Telugu Tollywood Movi-Balakrishna And Boyapati Movie Budjet Latest Update-Balakrishna Hatrick Balakrishna Rular Flop Tollywood Hero Srinu Legend Simha

ఈ క్రమంలో ఈయన చేసిన రూలర్‌ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడింది.ఆ చిత్రంతో బాలయ్య మైండ్‌ బ్లాంక్‌ అయినంత పనైంది.

కనీసం 10 కోట్లు కూడా రాబట్ట లేక బాలయ్య చేతులు ఎత్తేశాడు.

ఇంతటి దారుణమైన కలెక్షన్స్‌ను ఎవరు ఊహించి ఉండరు.రూలర్‌ కలెక్షన్స్‌ ఇప్పుడు బోయపాటి చేయబోతున్న సినిమాపై పడ్డట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.బాలకృష్ణ మరియు బోయపాటిల కాంబో మూవీస్‌ రెండు కూడా మంచి హిట్‌ అయ్యాయి.

అందుకే వీరి కాంబోలో రాబోతున్న మూడవ సినిమా ఖచ్చితంగా బ్లాక్‌ బస్టర్‌ అవ్వడం ఖాయం అని అంతా అనుకుంటున్నారు.అందుకే ఏమాత్రం బడ్జెట్‌కు ఆలోచించకుండా 75 కోట్ల వరకు పెట్టాలని నిర్ణయించుకున్నారట.

కాని రూలర్‌ ఎఫెక్ట్‌తో బడ్జెట్‌ తగ్గించాలని నిర్ణయించారు.

బాలయ్య కెరీర్‌ చాలా దారుణ పరిస్థితుల్లో ఉంది.ఈ సమయంలో సినిమా హిట్‌ అయినా కూడా 50 కోట్లను మించి రాబట్టడం అంటే చాలా పెద్ద విషయం.అందుకే బోయపాటికి నిర్మాత 40 కోట్ల వరకు ఖర్చు పెట్టి తెరకెక్కించాలంటూ సూచించాడట.

దాంతో బోయపాటి తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ బడ్జెట్‌తో సినిమాను చేసేందుకు ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు