బాలయ్య108 : రెండు రోజులు ఆగలేవా అనిల్ రావిపూడి?

నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) హీరోగా ప్రస్తుతం అనిల్ రావిపూడి( Anil ravipudi ) దర్శకత్వం లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా లో బాలకృష్ణ కాస్త వయసు ఎక్కువ ఉన్న పాత్ర లో కనిపించబోతున్నాడు.

 Balakrishna And Anil Ravipudi Movie Title Announcement Details, Telugu Movie New-TeluguStop.com

అంతే కాకుండా శ్రీ లీల వంటి పెద్ద అమ్మాయి కి తండ్రి గా కూడా కనిపించబోతున్నాడు.బాలకృష్ణ ను ఇలా మొదటి సారి చూడబోతున్నందుకు అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు.

ఇక ఈ సినిమా విడుదల తేదీ విషయం లో ఎప్పుడెప్పుడు అధికారికంగా ప్రకటన వస్తుందా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈనెల 10వ తారీఖున బాలకృష్ణ పుట్టిన రోజు( Balakrishna birthday ) ఉన్న విషయం తెలిసిందే.

ఆ రోజు ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ని టైటిల్ తో( First look poster and Title ) సహా విడుదల చేయాలని భావిస్తున్నారట అంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది.బాలయ్య పుట్టిన రోజుకు ఇంతకంటే మంచి బహుమానంగా ఏముంటుంది అని అంతా అనుకుంటున్న సమయంలో పుట్టిన రోజు కు రెండు రోజుల ముందే ఈ సినిమా యొక్క టైటిల్ ని అనౌన్స్ చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

Telugu Anil Ravipudi, Balakrishna, Balakrishnas, Poster, Nbk, Sreeleela, Telugu,

జూన్ 8వ తారీఖున సినిమా టైటిల్ ని రివీల్‌ చేయబోతున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించడంతో రెండు రోజులు ఆగి బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసి ఉంటే బాగుంటుంది కదా అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కానీ బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా చాలా కార్యక్రమాలు జరగబోతున్నాయి.ముఖ్యంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో బాలకృష్ణ హీరో గా ఒక సినిమా రూపొందబోతుంది.ఆ సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా రానుంది.

కనుక సినిమా ఎన్బీకే108 సినిమా టైటిల్ ప్రకటన ఒక రెండు రోజుల ముందే వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దర్శకుడు ఇలా ప్లాన్ చేసి ఉంటాడు అని నందమూరి ఫ్యాన్స్ అర్థం చేసుకుంటే బాగుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube