బాలయ్య అభిమానుల కోరిక సెప్టెంబర్ లో నెరవేరబోతుంది

నందమూరి అభిమానులు ఈమద్య కాలంలో చాలా సంతోషంగా ఉన్నారు.ఒక వైపు బాలకృష్ణ అఖండ సినిమా తో టైటిల్ కు తగ్గట్లుగా అలాంటి విజయాన్ని సొంతం చేసుకోగా.

 Balakrishna And Anil Ravipudi Movie Shooting Update  Balakrishna ,  Anil Ravipud-TeluguStop.com

మరో వైపు ఎన్టీఆర్‌ ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా తో అఖండమైన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.అబ్బాయి మరియు బాబాయిలు వరుసగా విజయాలతో దూసుకు పోతున్న నేపథ్యంలో చాలా మంది అభిమానులు ఆనందంలో మునిగి పోయారు.

ఇక ఎన్టీఆర్‌ తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న విషయం తెల్సిందే.ఇటీవలే ఆయన ఆచార్య సినిమాను చేసి ప్లాప్‌ అయ్యాడు.

కనుక ఎన్టీఆర్‌ విషయంలో కాస్త కంగారుతో అభిమానులు ఉన్నారు.కాని బాలయ్య విషయంలో మాత్రం అభిమానులు ఫుల్‌ ఖుషీగా ఉన్నారు.

అఖండ సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా ను చేస్తున్నాడు.జులై వరకు సినిమా పూర్తి అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బాలకృష్ణ మరియు అనీల్ రావిపూడి కాంబో మూవీ వచ్చే సెప్టెంబర్‌ లో పట్టాలెక్కబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎఫ్ 3 సినిమా విడుదల అయ్యి.

హడావుడి పూర్తి అయిన వెంటనే బాలయ్య సినిమా పనిలో అనీల్‌ రావిపూడి పడబోతున్నాడు.తద్వార సినిమా పనులు మొదలు అవుతాయి.

ఆగస్టు లో సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి అవుతాయి.సెప్టెంబర్‌ లో కెమెరా స్విచ్చాన్‌ చేయబోతున్నారట.

ఈ సందర్బం కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు.ఎఫ్‌ 2 వంటి మంచి విజయాన్ని సొంతం చేసుకుని ఎఫ్ 3 సినిమా తో నవ్వులు పూయించబోతున్న అనీల్‌ రావిపూడి ఖచ్చితం గా బాలయ్య తో భలే సినిమా తీస్తాడనే నమ్మకం ను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube