ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అదరగొట్టిన బాలయ్య.. రూ.కోటి సాధించిన రెండో సినిమాగా అఖండ..

నందమూరి బాలక్రిష్ణ. మాస్ సినిమాలతో జనాల్లో జోష్ నింపడంలో ఆయనకు ఆయనే సాటి.

 Balakrishna Akhanda Record In Rtc Cross Roads Details, Balakrishna, Akhanda Movie,rtc Cross Roads, Pragya Jaiswal, Boyapati Srinu, One Crore Rupees,akhanda Movie Record, Tollywood-TeluguStop.com

అందునా బోయపాటి, బాలయ్య కాంబోలో సినిమా అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పటికే వీరిద్దరు కలిసి చేసిన సినిమాలు ఓ రేంజిలో దుమ్ము రేపాయి.

తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డులను తిరగరాశాయి.అంతేకాదు.

 Balakrishna Akhanda Record In Rtc Cross Roads Details, Balakrishna, Akhanda Movie,rtc Cross Roads, Pragya Jaiswal, Boyapati Srinu, One Crore Rupees,akhanda Movie Record, Tollywood-ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అదరగొట్టిన బాలయ్య.. రూ.కోటి సాధించిన రెండో సినిమాగా అఖండ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన సినిమా రికార్డులను తానే బ్రేక్ చేశాడు బాలయ్య.టాలీవుడ్ లో 1000 రోజులు ఆడిన సినిమాగా లెజెండ్ రికార్డు నెలకొల్పింది.

తాజాగా మరో సెన్సేషనల్ రికార్డుతో సంచలనం కలిగించాడు.సింహ, లెజెండ్ తర్వాత అఖడం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టింది.

అంతేకాదు.వరుసగా హ్యాట్రిక్ హిట్ కొట్టారు బాలయ్య, బోయపాటి.

డిసెంబర్ 2న విడుదల అయిన ఈ సినిమా భారీ విక్టరీ కొట్టింది.

తాజాగా 100 సెంటర్లకు పైగా 50 రోజులు కంప్లీట్ చేసుకుంది.

ఓటీటీలోనూ విడుదలై దుమ్ము రేపుతుంది.హాట్ స్టార్ లో రిలీజ్ అయిన 24 గంటల్లోనే మిలియన్ స్ట్రీమింగ్ సాధించింది.

బాలయ్య అభిమానులు ఓరేంజిలో ఖుషీ అవుతున్నారు.తాజాగా మరో గుడ్ న్యూస్ విన్నారు.ఈ సినిమా విడుదలైన ప్రతి సెంటర్ లో కోటి రూపాయల మార్క్ అందుకుంది.50 రోజులు దాటినా మంచి వసూళ్లు సాధిస్తుంది ఈ సినిమా.తాజాగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో బాలయ్య అఖండ కొత్త రికార్డును సాధించింది.ఇక్కడ చాలా కాలం తర్వాత కోటి రూపాయలు వసూలు చేసిన సినిమాగా నిలిచింది.

తొలిసారి 2001లో బాలయ్య సినిమా నరసింహ నాయుడు కోటి రూపాయల మార్క్ అందుకుంది.20 ఏండ్ల తర్వాత మళ్లీ బాలయ్య సినిమా అఖండ ఆ ఘనతను రిపీట్ చేసింది.బాలయ్య కెరీర్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కోటి రూపాయలు రాబట్టిన రెండో సినిమాగా అఖండ నిలిచింది.సుదర్శన్ థియేటర్ లో 53వ రోజు మధ్యాహ్నం వరకు ఈ రికార్డును క్రియేట్ చేసింది అఖండ సినిమా.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు.

Balakrishna Akhanda Record In Rtc Cross Roads Details, Balakrishna, Akhanda Movie,rtc Cross Roads, Pragya Jaiswal, Boyapati Srinu, One Crore Rupees,akhanda Movie Record, Tollywood - Telugu Akhanda, Balakrishna, Boyapati Srinu, Crore Rupees, Pragya Jaiswal, Rtc Cross Roads, Tollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube