బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి రానున్న అఖండ!

Balakrishna Akhanda Ott Release Date Locked

హీరో బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం అఖండ. బోయపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

 Balakrishna Akhanda Ott Release Date Locked-TeluguStop.com

ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

భారీ అంచనాల నడుమ డిసెంబర్ 2 న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.విడుదలైన రెండు రోజులకే ఈ సినిమా దాదాపుగా 40 కోట్ల గ్రాస్ ను రాబట్టింది.

 Balakrishna Akhanda Ott Release Date Locked-బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. ఓటీటీలోకి రానున్న అఖండ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.అలాగే బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో మూడవ బ్లాక్ బస్టర్ సినిమాగా ఈ సినిమా నిలిచింది.

ఈ సినిమాలో పవర్ ఫుల్ డైలాగులు, బాలయ్య గెటప్ లు, ఫైట్ సీన్స్ అన్ని హైలెట్ గా నిలిచాయి.ఈ సినిమా విడుదల అయ్యి వారం కావస్తున్నా కూడా సినిమా థియేటర్ ల వద్ద హౌస్ ఫుల్ బోర్డు లు దర్శనమిస్తున్నాయి.

ఆన్లైన్ లో సైతం టికెట్లు దొరకడం కష్టంగా ఉంది.ఈ సినిమా విడుదల అయ్యి కేవలం వారం రోజుల్లోనే రూ.85 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్ల చేసినట్లు సమాచారం.

Telugu Akhanda, Akhanda Ott, Balakrishna, Blockbuster, Boyapati Srinu, Disney Hot, Ott, Tollywood-Movie

చాలా రోజుల తర్వాత బాలకృష్ణ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్‌ పడడంతో నందమూరీ అభిమానుల ఆనందానికి హద్దులేకుండా పోతుంది.ఈ క్రమంలోనే తాజాగా అఖండ్ మూవీ గురించిన మరో క్రేజీ అప్‌డేట్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ చిత్రం ఓటీటీలో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.2022 కొత్త సంవత్సరం కానుకగా ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అఖండ స్ట్రీమింగ్‌ కానుందట.

ఈ విషయం పై త్వరలోనే అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

#Balakrishna #Disney Hot #Blockbuster #Boyapati Srinu #Akhanda

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube