అఖండ నైజాం వసూళ్ల అంచనా..!

Balakrishna Akhanda Nizam First Day Collection Estimation

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చి’ అఖండ సినిమాకు అన్నిచోట్ల సూపర్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పొచ్చు.సరైన మాస్ సినిమా కోసం ఎదురుచూస్తున్న తెలుగు ఆడియెన్స్ ఆకలి తీర్చేలా ‘అఖండ’ అదిరిపోయిందని అంటున్నారు.

 Balakrishna Akhanda Nizam First Day Collection Estimation-TeluguStop.com

సినిమాలో పెద్దగా కథ కొత్తగా ఏమి లేకున్నా బాలయ్య ఊర మాస్ యాక్షన్  తో థియేటర్ లు దద్దరిల్లిపోయేలా చేస్తున్నాయి. ప్రీమియర్స్ షో బుకింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ సినిమా సంచలన విజయం అని చెప్పేలా వసూళ్ల ఉన్నాయి.ఇక నైజాం లో’ అఖండ’ సినిమా మొదటి రోజు 5.5 కోట్ల దాకా వసూళ్ల చేసే అవకాశం ఉందని అంటున్నారు.

బాలకృష్ణ కెరియర్ లో హయ్యెస్ట్ ఫస్ట్ డే కలక్షన్స్ రాబట్టిన సినిమాగా అఖండ వస్తుందని చెప్పొచ్చు.కరోనా సెకండ్ వేవ్ తర్వాత స్టార్ హీరో సినిమాగా’ అఖండ’కు ఆడియెన్స్ నుండి బీభత్సమైన రెస్పాన్స్ వచ్చింది.

 Balakrishna Akhanda Nizam First Day Collection Estimation-అఖండ నైజాం వసూళ్ల అంచనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యూఎస్ లో కూడా ‘అఖండ’ హంగామా అదే రేంజ్ లో ఉంది.యూఎస్ లో ప్రీమియర్స్ షోతోనే 300k మిలియన్ మార్క్ సాధించింది అఖండ.

చూస్తుంటే అఖండ అద్వితీయమైన విజయాన్ని అందుకునేలా ఉంది. సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్ విలన్ గా నటించి మెప్పించారు.

#Akhanda #Nizam #Boyapati Srinu #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube