ఆచార్య 'లాహె లాహె'కు పోటీగా అఖండ కూడా దించబోతున్నాడు

మెగా స్టార్‌ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణల మద్య 1980 మరియు 1990 ల్లో ఉన్న పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.వీరిద్దరు నెం.1 స్థానం కోసం పోటీ పడ్డారు.చివరకు ఆ పోటీ లో చిరంజీవి ముందు నిలిచాడు.బాలయ్య బాబు నెం.2 లో నిలిచాడు.భారీ ఎత్తున వీరిద్దరి మద్య కొనసాగిన పోటీ అంతా ఇంతా కాదు.ప్రస్తుతం బాలయ్య పోటీలో కాస్త వెనుకబడి ఉన్నాడు.ఈ సమయంలో ఆయన అఖండ సినిమా మళ్లీ జనాల్లో చర్చ కు తెర లేపింది.చాలా కాలం తర్వాత బాలయ్య బాబు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఉన్నాడు.

 Balakrishna Akhanda Movie Songs Coming Soon-TeluguStop.com

అది కూడా అఖండ సినిమా వల్ల అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు అంటున్నారు.పెద్ద ఎత్తున బాలయ్య మరియు చిరంజీవి మద్య పోటీ ఉంటుందని అంటున్నారు.

ఇప్పటికే అఖండ మరియు ఆచార్యల మద్య పోటీ విషయమై హాట్ టాపిక్ నడుస్తోంది.ఇద్దరు కూడా ఈ రెండు సినిమా లను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.చిరంజీవి ఇప్పటికే ఆచార్య సినిమా పై అంచనాలు పెంచే విధంగా ప్రమోషనల్‌ వీడియో మరియు ఫొటోలను విడుదల చేశాడు.ఇక లాహె లాహె సాంగ్‌ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

 Balakrishna Akhanda Movie Songs Coming Soon-ఆచార్య లాహె లాహె’కు పోటీగా అఖండ కూడా దించబోతున్నాడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదే సమయంలో అఖండ సినిమా నుండి కూడ ఆ పాటలు వస్తున్నాయి అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.లహరి మ్యూజిక్ ఇటీవలే ఈ సినిమా ఆడియో రైట్స్ ను దక్కించుకుంది.

ఒకొక్కటి చొనప్పున సినిమా నుండి అయిదు పాటలను విడుదల వరకు యూట్యూబ్ ద్వారా వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇది ఖచ్చితంగా ఆచార్య కు పోటీ అంటున్నారు.

అఖండ సినిమా పై ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ సినిమా పాటల పై ఆసక్తి నెలకొంది.బాలయ్య కు జోడీగా అఖండలో పూర్ణ మరియు ప్రగ్యా జైస్వాల్‌ నటించిన విషయం తెల్సిందే.

#Acharya #Balakrishna #Boyapati #AkhandaMovie #Chiranjeevi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు