బాలయ్య అఖండ పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతుందా!

సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ‘ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.

 Balakrishna Akhanda Movie Release On Sankranthi Season-TeluguStop.com

ఈ సినిమా విడుదల కోసం నందమూరి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమా దసరా రేస్ లోనే రాబోతుందని ఇప్పటి వరకు అభిమానులంతా అనుకున్నారు.

కానీ ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉండడంతో దసరా సీజన్ లో రావడం కష్టంగానే కనిపిస్తుంది.దసరా రేస్ లోకి రావాలంటే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల తేదీని ప్రకటించి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయాలి.

 Balakrishna Akhanda Movie Release On Sankranthi Season-బాలయ్య అఖండ పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతుందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఈ సినిమా ఇంకా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.ఈ నెలాఖరుకి ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని సమాచారం.

ఈ నెలాఖరున సినిమా పూర్తి అయినా కూడా ఈ సినిమా దసరా సీజన్ లో విడుదల చేయవచ్చు.కానీ తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సంక్రాంతి బరిలోకి రాబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.

ఇప్పటికే సంక్రాంతి బరిలోకి మూడు పెద్ద సినిమాలు ఉన్నారు.

Telugu Akhanda, Akhanda Update, Balakrishna, Balakrishna Akhanda Movie Release On Sankranthi Season, Boyapati Srinu, Coming Soon, Pragya Jaiswal, Sankranthi Season-Movie

మహేష్ సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలు విడుదల అవ్వబోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

ఈ మూడు సినిమాలో 12, 13, 14 తేదీలను బ్లాక్ చేసి విడుదలకి సిద్ధంగా ఉంచుకున్నారు.ఇక బాలకృష్ణ సెంటిమెంట్ ప్రకారం అఖండ సినిమా సంక్రాంతి రేస్ లోకి వస్తే ఈ మూడు తేదీలలో ఒక తేదీని ప్రకటిస్తారా లేదంటే కొత్త తేదీలో రిలీజ్ చేస్తారా అనేది వేచి చూడాలి.

Telugu Akhanda, Akhanda Update, Balakrishna, Balakrishna Akhanda Movie Release On Sankranthi Season, Boyapati Srinu, Coming Soon, Pragya Jaiswal, Sankranthi Season-Movie

ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి గుమ్మడి కాయ కొట్టే రోజున ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారని సమాచారం.మరి మొత్తానికి బాలకృష్ణ అంత పోటీ ఉన్న సంక్రాంతి సీజన్ లోనే అఖండ సినిమాను విడుదల చేయాలనీ అనుకుంటున్నాడు.మరి ఈ సినిమాలు పోటీ తట్టుకుని బాలయ్య అఖండ సినిమా ఏ మేరకు నిలబడుతుందో చూడాలి.

#Akhanda #Pragya Jaiswal #Akhanda #Boyapati Srinu #Balakrishna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు