'అఖండ' రిలీజ్ డేట్‌ కోసం మీటింగ్ జరగబోతుంది!

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో రూపొందుతున్న అఖండ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యి చాలా కాలం అయ్యింది.

 Balakrishna Akhanda Movie Release Date Meeting , Akhanda, Balakrishna, Boyapati-TeluguStop.com

కరోనా వల్ల ఆలస్యం అయిన ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఇప్పటికి కూడా ఒక స్పష్టత ఇవ్వడం లేదు.కొన్ని వందల కొద్ది అభిమానులు బోయపాటిని విడుదల తేదీ ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు.

అయినా కూడా ఎప్పుడు చెప్పలేం అంటూ దాట వేస్తూ వస్తున్నారు.ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చేందుకు గాను నిర్మాత మరియు డిస్టబ్యూటర్లు మీటింగ్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.

Telugu Akhanda, Balakrishna, Boyapati Srinu-Movie

అఖండ సినిమాకు ఉన్న బజ్‌ నేపథ్యం లో మంచి టైమ్‌ చూసి విడుదల చేస్తే ఖచ్చితంగా ఫలితంతో సంబంధం లేకుండా మొదటి రెండు మూడు రోజుల్లో పాతిక నుండి ముప్పై కోట్ల వరకు రాబట్టి బ్రేక్ ఈవెన్‌ సాధించే అవకాశం ఉంది.మినిమం సక్సెస్ టాక్ దక్కించుకుంటే సినిమా ఏకంగా 50 కోట్లు వసూళ్లు చేస్తుందనే నమ్మకంను వారు వ్యక్తం చేస్తున్నారు.అందుకే సరైన సమయం ను చూసి విడుదల చేసేందుకు గాను బయ్యర్లు నేడు నిర్మాత తో భేటీ అయ్యి విడుదల విషయమై చర్చించ బోతున్నట్లుగా తెలుస్తోంది.నేడు జరుగబోతున్న మీటింగ్ లో విడుదల తేదీని ఖరారు చేసి వచ్చే రెండు మూడు రోజుల్లోనే విడుదల తేదీ ని అధికారికంగా ప్రకటించేలా ప్లాన్‌ చేస్తున్నారు.

ఇప్పటికే సినిమా పూర్తి అయ్యింది.చివరి దశ పనులు జరుగుతున్నాయి.అన్ని అనుకున్నట్లుగా జరిగితే డిసెంబర్‌ లో పుష్ప విడుదల అయిన తర్వాత వారంలో విడుదల చేస్తామని అంటున్నారు.ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube