పక్క రాష్ట్రంలో బాలయ్య ఫాలోయింగ్‌ మైండ్ బ్లోయింగ్‌

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా భారీగా వసూళ్లను దక్కించుకుంటుంది.రెండు రోజుల్లో ఏకంగా 5.5 లక్షల డాలర్ల వసూళ్లను నమోదు చేసిన విషయం తెల్సిందే.లాంగ్‌ రన్‌ లో మరో మిలియన్ డాలర్ల వసూళ్లను ఈ సినిమా దక్కించుకోవడం పక్కా అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.

 Balakrishna Akhanda Movie Karnataka Collections Details, Akhanda, Akhanda Colle-TeluguStop.com

ఈ సమయంలో బాలయ్య తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లకు ఏమాత్రం తగ్గకుండా కర్ణాటకలో వస్తున్న వసూళ్లు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.అక్కడ లాంగ్‌ రన్ లో కోటి రూపాయల వసూళ్లు నమోదు అయితే చాలా పెద్ద విజయం అన్నట్లుగా పరిగణించాలి.

కేవలం రాజమౌళి సినిమాలు లేదా పాన్ ఇండియా సినిమాలు మాత్రమే అక్కడ రెండు మూడు కోట్ల వసూళ్లు దక్కించుకుంటాయి.కాని అఖండ సినిమా కర్ణాటకలో ఏకంగా రెండున్నర కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది.

రెండవ రోజు 80 లక్షల వసూళ్లు దక్కించుకోగా వీకెండ్‌ లో మళ్లీ కలెక్షన్స్ పుంజుకుంటాయని అంటున్నారు.కేవలం కర్ణాటకలోనే లాంగ్‌ రన్ లో అఖండ సినిమా అఖండమైన వసూళ్లను అంటే 5 కోట్ల నుండి 6 కోట్ల రూపాయల వరకు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

శని ఆదివారాల్లో నమోదు అవ్వబోతున్న వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవడం కూడా కష్టం గా ఉందంటూ అభిమానులు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Akhanda, Time, Balakrishna, Boyapati Srinu, Karnataka, Pragya Jaiswal, To

ఖచ్చితంగా ఈ సినిమా మంచి వసూళ్లను అక్కడ ఇక్కడ అన్ని చోట్ల నమోదు చేస్తుందని అంతా ఆశిస్తున్నారు.బోయపాటి బాలయ్య ల కాంబోలో వచ్చిన ఈ మూడవ సినిమా హ్యాట్రిక్ ను దక్కించుకుంది.ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో శ్రీకాంత్‌  విలన్ గా నటించాడు.

 ఈ సినిమా బాలయ్య కేరీర్ లో ఆల్‌ టైమ్ రికార్డు ను దక్కించుకోబోతున్నట్లుగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube