నంది-పంది.. రైమింగ్‌ బాగుంది కాని అర్థమే కాస్త తేడా కొడుతోంది 'అఖండ'

నందమూరి బాలకృష్ణ.బోయపాటి శ్రీనుల కాంబోలో రూపొందుతున్న సినిమాకు ఉగాది సందర్బంగా టైటిల్‌ ను ఖరారు చేశారు.

 Balakrishna Akhanda Movie Dialogue-TeluguStop.com

ఈ సినిమాకు అఖండ అనే టైటిల్‌ ను పెట్టడంతో పాటు టీజర్‌ ను కూడా విడుదల చేశారు.ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న బిబి 3 సినిమా టైటిల్‌ ను అనౌన్‌ చేయడంతో పాటు టీజర్‌ ను విడుదల చేసిన నేపథ్యంలో నందమూరి అభిమానులు ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు.

బాలయ్య బోయపాటి సినిమా అంటే అభిమానులు మాస్‌ డైలాగ్‌ లను ఆశిస్తారు.ఈ సినిమాలో ఆ డైలాగ్‌ లు కుప్పలు తెప్పలుగా ఉన్నట్లుగా ఉన్నాయి.అందులో శాంపిల్‌ గా ఒకటి వదిలారు.అదే….కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది! ఈ డైలాగ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్డింగ్‌ లో ఉంది.

 Balakrishna Akhanda Movie Dialogue-నంది-పంది.. రైమింగ్‌ బాగుంది కాని అర్థమే కాస్త తేడా కొడుతోంది అఖండ’-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ డైలాగ్‌ ను కొందరు మాత్రం తప్పుబడుతున్నారు.అర్థం పర్థం లేకుండా ఉందంటూ సోషల్‌ మీడియా టాక్‌ నడుస్తోంది.

కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది ఏంటి బాబు అంటూ కొందరు.ఈ నంది పంది రైమింగ్‌ బాగుందని వాడారు తప్ప ఇందులో అర్థం వెదికే ప్రయత్నం చేయవద్దంటూ మరి కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

మొత్తానికి నంది పంది డైలాగ్‌ చాలా పాపులర్‌ అయ్యింది.ఇదే సమయంలో కొందరు విమర్శలు చేస్తున్నారు.

ప్రశంసలు మాత్రమే కాకుండా విమర్శలు వస్తేనే ఆ డైలాగ్‌ కు మరింత పాపులారిటీ వస్తుందని బాలయ్య అభిమానులు అంటున్నారు.కొందరు విమర్శలు చేసినంత మాత్రాన పోయేది ఏమీ లేదు అంటూ వారు చెబుతున్నారు.

మా బాలయ్య మరోసారి అఖండ సినిమా తో ఇతరుల రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అంటూ ఉన్నారు.సింహా మరియు లెజెండ్‌ రికార్డులను బ్రేక్‌ చేసే విధంగా అఖండ ఉంటుందని అంటున్నారు.

ఈ సినిమా లో పూర్ణ కీలక పాత్రలో కనిపించబోతు ఉండగా ప్రగ్య జైస్వాల్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న విషయం తెల్సిందే.

#Akhanda #Balakrishna #Boyapati

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు